ETV Bharat / state

భారీగా పెరిగిన శ్రీశైలం సొరంగ పనుల వ్యయం - శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ ప్రాజెక్టు

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయం భారీగా పెరిగింది. ప్రాజెక్టు పనుల్లో భాగమైన డిండి జలాశయంతో పాటు ప్రధాన కాల్వ పనుల అంచనా వ్యయాన్ని ప్రభుత్వం పెంచింది.

శ్రీశైలం సొరంగ పనుల వ్యయం
author img

By

Published : Nov 19, 2019, 5:54 AM IST

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయం భారీగా పెరిగింది. ప్రాజెక్టు పనుల్లో భాగమైన డిండి జలాశయంతో పాటు ప్రధాన కాల్వ పనుల అంచనా వ్యయాన్ని ప్రభుత్వం పెంచింది. డిండి, పెండ్లిపాక జలాశయం సహా ప్రధాన కాల్వ పనులు, మొదటి, రెండో లింక్ కాల్వ పనులకు సంబంధించిన అంచనా వ్యయాన్ని రూ. 521 కోట్ల నుంచి రూ. 1,764 కోట్ల 50లక్షలకు పెంచారు. ఇందులో డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనుల విలువను రూ. 242 కోట్ల నుంచి రూ. 1,147 కోట్లకు పెంచారు.

పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సహా ప్రధాన కాల్వ పనుల విలువను రూ. 278 కోట్ల నుంచి రూ. 598 కోట్లకు పెంచారు. మొదటి లింక్ కాల్వకు రూ. 3.78 కోట్లు, రెండో లింక్ కాల్వకు రూ. 15.42 కోట్ల అంచనా వ్యయంగా ప్రతిపాదించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రతిపాదనలను ఆమోదించిన ప్రభుత్వం అంచనా వ్యయాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

శ్రీశైలం సొరంగ పనుల వ్యయం

ఇదీ చూడండి: 'ఆర్టీసీ సమ్మెపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి'

Intro:Body:

eenadu

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.