కరోనా బారిన పడిన బాచుపల్లి ఎస్సై మహ్మద్ యూసుఫ్‌కు చాంద్రాయణగుట్ట ఠాణాకు చెందిన కానిస్టేబుల్ ఆర్.సాయికుమార్ ప్లాస్మా దానం చేయడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. బక్రీదు రోజున దానం చేయడం వల్ల ఈ ఘటన మతసామరస్యానికి ప్రతీకగా అభివర్ణిస్తున్నారు.
కరోనా కట్టడిలో ముందుండి పోరాడుతున్న పోలీసు సిబ్బందిలో ఒకరైన సాయికుమార్‌కు కరోనా సోకి పూర్తిగా కోలుకున్నాడు. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మహ్మద్ యూసుఫ్ కరోనాతో బాధపడుతున్నాడని, అత్యవసర చికిత్స నిమిత్తం ఏబీ-పాజిటివ్ ప్లాస్మా అవసరమనే ప్రకటనను శనివారం సామాజిక మాధ్యమంలో చూశాడు.
తనదీ అదే బ్లడ్ గ్రూప్ కావడం వల్ల వెంటనే అక్కడికి వెళ్లి ప్లాస్మా దానమిచ్చాడు. ఆ తరువాతే యూసుఫ్ ఎస్సై అని అతనికి తెలిసింది. ఈ విషయం సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. బక్రీద్ పండగ రోజు ఓ ముస్లిం సోదరుడికి ఓ హిందువు ప్లాస్మా దానం చేయడాన్ని నెటిజన్లు ప్రశంసించారు. చాంద్రాయణగుట్ట సీఐ రుద్రభాస్కర్, డీఐ కె.ఎన్.ప్రసాద్‌వర్మ, ఎస్సైలు, గచ్చిబౌలి సీఐ జగదీశ్వర్‌రావు సాయికుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
ఇదీ చూడండి : పీఎస్‌కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు