ETV Bharat / state

కారు ఢీ కొట్టడంతో కానిస్టేబుల్ మృతి - హెచ్ఎండిఎ లే అవుట్​లో ప్రమాదం

అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. విధులు నిర్వహిస్తోన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలను బలిగొంది. తీవ్ర గాయాలపాలయిన కానిస్టేబుల్​ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కారు డ్రైవర్​ని పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.

the constable died in car accident in Hyderabad
కారు ఢీ కొట్టడంతో కానిస్టేబుల్ మృతి
author img

By

Published : Jul 11, 2020, 9:11 PM IST

హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ ఉప్పల్ పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉప్పల్ నాగోల్ మధ్యలో ఉన్న హెచ్ఎండీఎ లేఅవుట్​ ద్విచక్రవాహనంపై పోలీస్ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న సమయంలో అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది.

అజయ్ కుమార్​కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్​ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండీ: ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్‌ ఢీ.. ఒకరు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.