దేశ సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దాపరికం లేకుండా వెల్లడించాలని.. రాజకీయాలకు తావులేకుండా దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. 20 మంది సైనికులను కోల్పోయిన ఈ తరుణంలో తానొక భారతీయుడిగా బాధాతప్త హృదయంతో మాట్లాడాల్సి రావడం విచారకరమన్నారు.
దేశ సరిహద్దుల్లోకి చైనా సైన్యం రాలేదని, మన స్థావరాలపై దాడి జరగలేదని చెబుతున్న ప్రధాని మోదీ మాటలకు, ఆయన మంత్రివర్గంలోని విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులు చెబుతున్న మాటలకు ఎక్కడా పొంతన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మే నెల నుంచి చైనాతో ఇబ్బందులు తలెత్తుతున్నప్పుడు ఆ విషయాన్ని ఎందుకు బహిర్గత పరచలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా దాపరికాలు లేకుండా వాస్తవాలు ప్రజలకు వివరించాలని కోరారు. తామంతా అండగా ఉంటామని తెలిపారు.