తెలంగాణ మొదటి పీఆర్సీ ఇంత తక్కువ మొత్తం ఫిట్మెంట్ సిఫారసు చేయడం విడ్డూరంగా ఉందని... కచ్చితంగా మంచి ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనని వివిధ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. మూడో రోజు చర్చల్లో భాగంగా టీటీయూ, టీఆర్టీఎప్, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సంఘాల ప్రతినిధులతో అధికారుల కమిటీ సమావేశమైంది. పీఆర్సీ నివేదికపై ఆయా సంఘాల అభిప్రాయాలు, వినతులను స్వీకరించింది.
ఇంత తక్కువ ఫిట్మెంట్ తగదన్న సంఘాల నేతలు... మెరుగైన వేతనసవరణ ఇవ్వాలని కోరారు. హెచ్ఆర్ఏను తగ్గించడం సమంజసం కాదని అన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత ఫించను విధానాన్ని అమలు చేయాలని కోరారు. తమకు పదోన్నతులు ఇవ్వాలని భాషా పండితులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: '45 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలి'