విజయవాడలో కత్తులు, రాళ్లతో దాడులు చేసుకుని యువకులు వీరంగం సృష్టించారు. పటమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య వివాదం తలెత్తడంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ దాడుల్లో మాజీ రౌడీ షీటర్ ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది.
ఈ గొడవలు విజయవాడ పటమట వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. కత్తి పోట్లు, రాళ్ల దాడుల్లో గాయపడ్డ వారిని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు తరలించారు. రాజకీయ పార్టీల నేతల అనుచరులు కూడా ఉండటంతో విజయవాడ నగర పోలీసులు గుట్టుగా విచారణ చేస్తున్నారని సమాచారం.
ఇవీ చదవండి: ఆంధ్రా- తెలంగాణ సరిహద్దులో మద్యం పట్టివేత...