ETV Bharat / state

ముగిసిన పసందైన పతంగుల వేడుక - The celebration of the end of year parade in telangana

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ పతంగుల పండుగ ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుక రంగు రంగుల గాలిపటాలతో నింగి వర్ణశోభితమైంది. విదేశాలకు చెందిన కైట్‌ ప్లేయర్‌ బృందాలు విభిన్న రకాల పతంగులతో ఔరా అనిపించారు. పతంగులను వీక్షించేందుకు నగరవాసులు కుటుంబ సమేతంగా  పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆనందంగా గడిపారు.

The celebration of the end of year parade in telangana
ముగిసిన పసందైన పతంగుల వేడుక
author img

By

Published : Jan 16, 2020, 5:02 AM IST

హైదరాబాద్ మహానగరంలో సంక్రాంతి పండుగ నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర సాంస్కృతిక, పర్యటకశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పతంగుల వేడుక సికింద్రాబాద్‌లో మంగళవారం వైభవంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకల్లో రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న పలువురు కళాకారులను మంత్రి ఘనంగా సత్కరించారు. వచ్చే ఏడాది మరింత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ప్రతి ఏడాది వివిధ అంశాలను పెంచుతున్నట్లు ఆయన చెప్పారు.

రిమోట్​తో ఎగురవేసిన పతంగులు
మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో 25 దేశాలకు చెందిన ప్రతినిధులు వివిధ రకాల పంతగులను ఎగురవేశారు. ఈ వేడుకల్లో సింగపూర్​కు చెందిన ప్రతినిధులు రిమోట్​తో ఎగురవేసిన పతంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రభుత్వం గతేడాది కంటే ఈసారి ఏర్పాట్లు బాగా చేసారని సందర్శకులు ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా వచ్చి ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేశామని చెబుతున్నారు.

వేయికి పైగా వంటకాలు
ఇంటర్నేషనల్‌ కైట్‌, స్వీట్‌, స్నాక్​ ఫెస్టివల్‌ నిర్వహించడం సంతోషంగా ఉందని పర్యటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. స్వీట్‌ ఫెస్టివల్‌లో 24 రాష్ట్రాల నుంచి దాదాపు వేయికి పైగా వంటకాలను భాగ్యనగరవాసులకు అందించినట్లు ఆయన తెలిపారు.

మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో చివరి రోజు నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. చిన్న పెద్ద అందరూ కలిసి గాలి పటాలను ఎగురవేస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాలైన వంటకాలు, స్వీట్స్‌, స్నాక్స్​ స్టాళ్లలో భోజన ప్రియులు సందడి చేశారు.

ముగిసిన పసందైన పతంగుల వేడుక

ఇదీ చూడండి : ముగ్గులు.. బొబ్బెమ్మలు.. పతంగులతో ఘనంగా సంక్రాంతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.