ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఇకపై ప్రకటన(నోటిఫికేషన్) వెలువడిన నాటి నుంచి 14 రోజుల్లోనే పూర్తి చేయనున్నారు. ఈమేరకు పంచాయతీరాజ్ చట్టానికి ఇప్పటికే సవరణలు చేశారు. సంబంధిత బిల్లును ఈనెల 30 నుంచి నిర్వహించనున్న శాసనసభ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2013లో పంచాయతీ ఎన్నికలను 21 రోజుల పాటు నిర్వహించారు. ఈ వ్యవధిని 14 రోజులకు కుదిస్తూ 1994 పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణలపై ఆగస్టులో గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. గడువులోగా అసెంబ్లీలో బిల్లు పెట్టకపోవడంతో మళ్లీ తెరపైకి వచ్చింది.
ఎన్నికల నిర్వహణ ఇలా..
1వ రోజు: ఎన్నికల ప్రకటన(నోటిఫికేషన్)
3వ రోజు: నామినేషన్ల స్వీకరణ
5వ రోజు: నామినేషన్ల స్వీకరణకు తుది గడువు
6వ రోజు: నామినేషన్ల పరిశీలన
7వ రోజు: నామినేషన్ల తిరస్కరణ, అదేరోజు అభ్యంతరాల స్వీకరణ
8వ రోజు: అభ్యంతరాల పరిష్కారం
9వ రోజు: నామినేషన్ల ఉపసంహరణ.. పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ
14వ రోజు: ఎన్నికల నిర్వహణ, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
ఇదీ చూడండి: 'భారతీయులందరికీ టీకా అందేది అప్పుడే'