ETV Bharat / state

Ts Cabinet: రుణమాఫీ... రూ. 50వేల లోపు రైతులకు నెలాఖరులోగా వర్తింపు

రుణమాఫీ అమలులో భాగంగా 50 వేలలోపు రుణాల ప్రక్రియ నెలాఖరులోగా పూర్తిచేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పత్తిసాగు ప్రోత్సహించాలని, వాణిజ్య పంటలకు అనువైన ప్రాంతాలను గుర్తించి లాభసాటి పంటలు సాగుచేసేలా... రైతులకు చేయూత అందించాలని అధికారులను ఆదేశించింది. 57 ఏళ్లు పైబడిన వారికి వృద్ధాప్య పింఛన్ల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు స్పష్టం చేసింది. కరోనా విషయంలో ఏ ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న కేబినెట్... కేసుల తీవ్రత ఎక్కవగా ఉన్న జిల్లాల్లో వైద్యబృందాలు మరోమారు పర్యటించాలని ఆదేశించింది. రెండు, మూడేళ్లలో అన్నిజిల్లాల్లో వైద్యకాలేజీలు ఏర్పాటు చేయాలని తీర్మానించిన మంత్రిమండలి... పటాన్‌చెరుకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేసింది.

cabinet
రుణమాఫీ
author img

By

Published : Aug 2, 2021, 5:22 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ (Ts Cabinet)... పలు శాఖలకు సంబంధించిన అంశాలు, పథకాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. 2018 ఎన్నికల వేళ ఇచ్చిన హామీలో భాగంగా రూ. 25వేలలోపు రుణాలు ఇప్పటికే మాఫీ చేయగా ఈనెల15 నుంచి నెలాఖరు వరకు రూ. 50 వేలలోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. రూ. 25వేల లోపు మూడు లక్షల మందికి లబ్ధి చేకూరగా... రూ. 50 వేలలోపు మాఫీతో మరో 6 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది.

రూ. లక్షలోపు మిగతా రుణమాఫీ ప్రక్రియను దశల వారీగా పూర్తి చేయాలని నిర్ణయించారు. విద్యా, ఉద్యోగావకాశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్యూఎస్ (EWS) రిజర్వేషన్లకు గరిష్ఠ ఆదాయ పరిమితిని రూ. 8 లక్షలుగా ఖరారు చేసిన మంత్రివర్గం... ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ఠ వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది.

అండగా నిలవాలి...

రాష్ట్రంలో పండే పత్తికి అంతర్జాతీయంగా ప్రత్యేక డిమాండ్‌ దృష్ట్యా పత్తిసాగును మరింతగా పెంచాలని కేబినెట్ ఆదేశించింది. వాణిజ్య పంటలకు అనువైన ప్రాంతాలు గుర్తించి, లాభసాటి పంటలసాగు మరింతగా ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు స్పష్టం చేసింది. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారుల పూర్తి వివరాలను తెప్పించాలని... వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శిని మంత్రివర్గం ఆదేశించింది. కన్నవారిని కోల్పోయిన చిన్నారులు ప్రయోజకులయ్యేంత వరకు ప్రభుత్వమే ఆశ్రయం కల్పించి అండగా నిలవాలని స్పష్టం చేసింది.

పింఛను బదిలీ...

మానవీయకోణంలో ఆలోచించి అనాథ చిన్నారులకు ఆశ్రయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, విధాన రూపకల్పన, కార్యాచరణకు 10 మంది మంత్రులు సభ్యులుగా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అధ్యక్షతన ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. వృద్ధాప్య ఫించన్లకు అర్హతా వయస్సు 57 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నందున.. ఆ ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని మంత్రివర్గం ఆదేశించింది.

కుటుంబంలో ఒక్కరికే పింఛను పద్ధతిని కొనసాగిస్తూ... భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు వెంటనే పింఛను బదిలీ చేయాలని... సీఎం స్పష్టం చేశారు. దోభీ ఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ నిర్ణయాన్ని వారంలో సంపూర్ణంగా అమలు చేయాలని నిర్దేశించారు. రైతు బీమా తరహాలో నేత, గీత కార్మికులకు సత్వరమే బీమా సదుపాయం కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

కరోనా పరిస్థితులపై...

కరోనా పరిస్థితిపై కేబినెట్‌కు వైద్యారోగ్య శాఖ వివరాలు సమర్పించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న వాక్సినేషన్ ప్రక్రియ, ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతులపై చర్చించారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో చేపట్టిన చర్యలు, ఆక్సిజన్, ఔషధాలు, పడకలు, తదితర లభ్యతపై విస్తృతంగా సమాలోచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించి... టీకా పంపిణీ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. కొవిడ్‌ కట్టడిలో ప్రజలు స్వీయ నియంత్రణతో పాటు నిబంధనలు పాటించాలని మంత్రివర్గం సూచించింది.

వచ్చే విద్యాసంవత్సరం...

కొత్తగా మంజూరు చేసిన... 7 వైద్యకళాశాలలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని స్పష్టంచేసింది. హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిని మరింతగా అభివృద్ధి చేసి వైద్యసేవలు విస్తృతపర్చేలా ప్రణాళికలు సిద్ధం చేసి వచ్చే సమావేశానికి తేవాలని వైద్యాధికారులకు స్పష్టం చేసింది. వరంగల్ సహా కొత్తగా ఏర్పాటు చేయబోయే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు.

టిమ్స్ నామకరణం...

హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. టిమ్స్​ (TIMS)గా నామకరణం చేయాలని కేబినెట్ తీర్మానించింది. గచ్చిబౌలి, సనత్​నగర్, ఎల్బీనగర్‌, అల్వాల్ ఆసుపత్రుల్లో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించింది. పటాన్ చెరులో కార్మికులు, ఇతర ప్రజల అవసరాల కోసం కొత్తగా ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రివర్గం మంజూరు చేసింది.

ఎస్​ఎల్​బీసీ పనులు...

నల్గొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు నుంచి చేపట్టిన ఎస్​ఎల్​బీసీ (SLBC) సొరంగ మార్గం పనులను పున:ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తిచేయాలని ఆదేశించింది. ఎస్ఎల్​బీసీ తవ్వకానికి ఉన్న సాంకేతిక, భౌగోళిక తదితర ఆటంకాలను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖను మంత్రివర్గం ఆదేశించింది. ఎస్ఎల్​బీసీ పనులు నిరాటంకంగా జరిగేలా నిరంతర కరెంట్‌ అందించాలని విద్యుత్ శాఖను ఆదేశించింది. ఆటంకాలు తొలగిన నేపథ్యంలో వీలైనంత త్వరగా పనులను ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఉదయ సముద్రం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేసింది. త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: cabinet: కొవిడ్ పరీక్షలు పెంచండి.. వ్యాక్సినేషన్​ను వేగవంతం చేయండి: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.