కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. దేశంలో ఉన్న ఆర్థిక మాంద్యాన్ని అధిగమించే రీతిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యూహాత్మకంగా బడ్జెట్ను ప్రవేశపెట్టారని కొనియాడారు.
ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థలకు ఊరట కలిగించే రీతిలో ఆదాయ పన్ను తగ్గింపులు ఇవ్వడం మంచి పరిణామమని తెలిపారు. సామాన్యులకు, రైతులకూ పెద్ద పీట వేశారన్నారు. రూ. 5 లక్షల వరకు పూర్తిగా పన్ను మినహాయించడం హర్షనీయమని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: కాళేశ్వరానికి జాతీయ హోదా కోరినా స్పందించలేదు: నామ