రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించిన తర్వాత జాతీయ బీసీ కమిషన్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా హైదరాబాద్ రానుంది. ఛైర్మన్ భగవాన్లాల్ సహాని, వైస్ ఛైర్మన్ డా. లోకేశ్ కుమార్ ప్రజాపతితో, సభ్యులు తల్లోజు ఆచారి, కౌసలేంద్ర పటేల్, సుదాయాదవ్లతో కూడిన బృందం రవీంద్రభారతిలో ఒంటి గంటకు సమావేశం కానుంది. ఇటీవల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో దిల్లీకి వెళ్లి కమిషన్ను కలిసి హైదరాబాద్కు రావాలని కోరారు. సమావేశంలో బీసీ, కుల, ఉద్యోగ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను కమిషన్కు అందజేస్తామని ఆర్. కృష్ణయ్య తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయా? లేదా? తెలుసుకుని అమలు చేయించే అధికారం కమిషన్కు ఉంటుందన్నారు.
ఇవీ చూడండి: కర్నాటకం: కాంగ్రెస్-జేడీఎస్ నేతల భేటీ