ETV Bharat / state

కరోనా లేకున్నా ఏపీలోని ఆరు పురలు రెడ్‌జోన్‌ పరిధిలోనే - corona updates in ap

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లాలో పట్టణాలపైనే యంత్రాంగం దృష్టి సారిస్తున్నట్లు ఉంది. ఆరు పట్టణాల్లో కరోనా కేసులు లేకున్నా ముందు జాగ్రత్తగా రెడ్‌ జోన్‌లో చేర్చారు. కానీ కేసులుండి జనాభా ఎక్కువున్న మండలాలను మాత్రం గ్రీన్​జోన్​లో ఉంచారు. ఇక్కడ మద్యం అమ్మకాలు జరుపుతున్నారు.

కరోనా లేకున్నా ఆరు పురాలు రెడ్‌జోన్‌ పరిధిలోనే

author img

By

Published : May 5, 2020, 7:21 PM IST

ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరు పురపాలక సంఘం పరిధిలో గత 40 రోజుల్లో ఒక్క కరోనా కేసు కూడా వెలుగు చూడలేదు. అనుమానితులను గుర్తించలేదు. కానీ ప్రస్తుతం తిరువూరు పట్టణం రెడ్‌జోన్‌ పరిధిలో ఉంది. అక్కడ లాక్‌డౌన్‌ నిబంధనలను అమలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంది. అక్కడే తిరువూరు మండలం గ్రీన్‌ జోన్‌ పరిధిలో ఉంది. అక్కడ మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.

ఇది తిరువూరు పట్టణానికి మాత్రమే కాదు.. జిల్లాలోని అన్ని పట్టణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తగా అన్ని పురాలను రెడ్‌జోన్‌ పరిధిలో చేర్చారు. గ్రామీణంలో జన సాంద్రత తక్కువగా ఉంటుంది. పురాల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కరోనా వ్యాప్తి తీవ్రత ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే కొన్ని పట్టణాల్లో కరోనా కేసులు లేకపోయినా రెడ్‌ జోన్‌లో చేర్చినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదీ పరిస్థితి!

జిల్లాలో ఆరు పట్టణాల్లో కరోనా కేసులు లేవు. క్వారంటైన్‌లు పూర్తి అయ్యాయి. కానీ రెడ్‌ జోన్‌లో చేర్చడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. అయినా ముందు జాగ్రత్తగా ఈ పట్టణాలను రెడ్‌ జోన్‌లో చేర్చారు. ఇక్కడ కేవలం ఉదయం 9గంటల వరకే నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి. మిగిలిన రోజంతా నిబంధనలు అమలులో ఉంటాయి. కానీ కొన్నిమండలాల్లో ఇంత కన్నా జనాభా ఎక్కువ ఉన్నా గ్రీన్‌ జోన్‌ పరిధిలో చేర్చారు. గన్నవరం, హనుమాన్‌ జంక్షన్‌లు దీనికి ఉదాహరణ. అక్కడ మందు కోసం జనం బారులు తీరారు. అర్బన్‌ ప్రాంతాల్లో దాదాపు కలిసిపోయిన పెనమలూరు మండలంలో 14 కేసులు, విజయవాడ గ్రామీణ మండలం పరిధిలో 15 కేసులు వచ్చాయి.

మైలవరంలోనూ జనాభా ఎక్కువగానే ఉన్నా.. అక్కడ గ్రీన్‌ జోన్‌ అమలులో ఉంది. జిల్లాలో రెండు మండలాలు సెమి అర్బన్‌ పెనమలూరు, విజయవాడ గ్రామీణం మాత్రమే రెడ్‌జోన్‌ పరిధిలో ఉండగా గన్నవరం ముసునూరు, జగ్గయ్యపేట గ్రామీణం, కంకిపాడు మండలాలు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. మిగిలిన 43 మండలాలు గ్రీన్‌ జోన్‌ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం గ్రీన్‌ జోన్‌లో మద్యం దుకాణాలు ప్రారంభించడంతో రెడ్‌ జోన్‌ నుంచి జనం వలసలు పెరిగాయి. రాకపోకలు ఎక్కువయ్యాయి. ఈ పరిణామం ఎటువైపునకు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. రెడ్‌జోన్‌లను ఆరెంజ్‌.. ఆరెంజ్‌లను గ్రీన్‌లుగా క్రమేపీ మార్చాల్సి ఉంది. దీనికి సీన్‌ రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇదీ చదవండి

మందుబాబులకు షాక్: రాష్ట్రంలో మరో 50 % మద్యం ధరలు పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.