నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్ సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాల్లో మరోసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. 306 మంది విద్యార్థులకు 13 మంది నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించగా, 22 మంది విద్యార్థులు 95 శాతం సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ సునీతారావు తెలిపారు.
201 మంది విద్యార్థులు 80% పైగా స్కోరు సాధించారని ఆమె అన్నారు. విద్యార్థులను పాఠశాల యాజమాన్యం పేరుపేరునా అభినందించింది. పాఠశాల ఛైర్మన్ కొమురయ్య, డైరెక్టర్ పల్లవి, ఉపాధ్యాయ బృందం చేసిన కృషి ఫలితంగా ఈ విజయం సాధించామని చెప్పారు. తమ పాఠశాలలో చదువుకే కాకుండా క్రీడలకు కూడా ప్రోత్సాహం ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తామని ప్రిన్సిపల్ అన్నారు.
ఇదీ చూడండి : గాంధీ భవన్కు కరోనా ఎఫెక్ట్.. వారం పాటు మూసివేత