ETV Bharat / state

ఆ విషయంలో మంత్రి కేటీఆర్​కు ధన్యవాదాలు: శ్రీనివాస్​గౌడ్​ - మంత్రి శ్రీనివాస్​గౌడ్​ తాజా వార్తలు

ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ పిలుపునిచ్చారు. హైదరాబాద్​లోని మంత్రుల నివాసంలో పరిసరాలను శుభ్రం చేశారు. నిల్వ నీటిని తొలగించారు.

Thanks to Minister KTR for that matter: Srinivas Goud
ఆ విషయంలో మంత్రి కేటీఆర్​కు ధన్యవాదాలు: శ్రీనివాస్​గౌడ్​
author img

By

Published : Jul 12, 2020, 2:28 PM IST

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​ పాల్గొన్నారు. హైదరాబాద్​లో మంత్రుల నివాసంలోని నర్సరీలో పరిసరాలను శుభ్రం చేశారు. పూలకుండీల్లోని నిల్వ నీటిని తొలగించారు.

వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారినపడకుండా మంత్రి కేటీఆర్ చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని శ్రీనివాస్​గౌడ్​ పేర్కొన్నారు. మంత్రి పిలుపు మేరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని.. తమ ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీచూడండి: 'లాల్​దర్వాజ బోనాలు కూడా ఇంతే.. ప్రజాక్షేమం కోసమే.!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.