జూన్ నెలలో ఎలాంటి కోతల్లేకుండా పూర్తి జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ... టీఎన్జీవో ఐక్య కార్యాచరణ సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. కొవిడ్-19 కారణంగా గత మూడు నెలలుగా ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన విషయం తెలిసిందే! రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవుతున్నందున జూన్ నెలలో జీతాలు పూర్తిగా చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ... వైరస్ కట్టడిలో నిరంతర సేవలందిస్తున్న ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని... జూన్ నెల పూర్తి జీతాలు చెల్లించడం పట్ల ఐకాస నేతలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ముఖ్యమంత్రి ఉద్యోగులకు ఇచ్చిన హామీలైన పదవీ విరమణ వయస్సు పెంపు, వేతన సవరణలను త్వరలోనే ఆమోదిస్తారని ఆశిస్తున్నామన్నారు ఐకాస నాయకులు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షులు కారెం రవిందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, మమత, మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఉద్యోగులు, పింఛనుదారులకు ఈనెల పూర్తి వేతనం: కేసీఆర్