ETV Bharat / state

కుటుంబసభ్యుల సహకారం మరువలేనిది: సీపీ అంజనీకుమార్​ - హైదరాబాద్ నగర వార్తలు

పోలీసులు తమ వృత్తిలో రాణించడానికి కుటుంబసభ్యుల సహకారమే కారణమని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. పోలీసు కుటుంబసభ్యుల ఆత్మీయ సభలో ప్రసంగిస్తూ పోలీసుల కుటుంబాలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

Thanka to police families to help society says CP Anjani kumar
కుటుంబసభ్యుల సహకారం మరువలేనిది: సీపీ అంజనీకుమార్​
author img

By

Published : Oct 29, 2020, 9:55 AM IST

పోలీసులు తమ వృత్తిలో రాణించడానికి వారి కుటుంబసభ్యుల సహకారం ఎంతో ఉందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వ్యాఖ్యానించారు. నిర్విరామంగా పని చేయడమే పోలీసు వృత్తిలో గుర్తింపు అని తెలిపారు. పోలీసు కుటుంబ సభ్యుల ఆత్మీయ సభలో పోలీసుల కుటుంబాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

పండుగ రోజు అందరూ సెలవుల్లో ఉంటే పోలీసులు మాత్రమే ప్రజల రక్షణకై రోడ్లపై డ్యూటీలు చేస్తారని సీపీ అన్నారు. పోలీసులు తమ వృత్తిలో రాణించడానికి కుటుంబసభ్యుల తోడ్పాటే కారణమని తెలిపారు. ప్రజలకు సేవ చేసే అదృష్టం పోలీసులకు మాత్రమే దక్కిందని సీపీ సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:విపత్తుల సమయంలో పోలీసులు మెరుగైన సేవలందించాలి: సీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.