ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 96వ జయంత్యుత్సవాలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణచారి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి, సినీ నటి జీవిత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రఖ్యాత అస్సామీ రచయిత నగిన్ సైకియాను ఎన్టీఆర్ నేషనల్ లిటరరీ అవార్డుతో ఘనంగా సన్మానించారు. నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ఎన్టీఆర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని రోశయ్య అన్నారు. ఎన్టీఆర్ లేని లోటు తీరనిదని, దానిని ఎవరు పూర్తి చేయలేరని పేర్కొన్నారు. ఆయనకు ఆయనే సాటి తప్ప మరెవరూ ఆయనకు పోటీ రారని రోశయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
ఇవీ చూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో 11 కిలోల బంగారం సీజ్