ETV Bharat / state

Gambling Case Update: థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్‌.. హైదరాబాద్‌ నుంచే పర్యవేక్షణ

Thailand Gambling Case Update: థాయ్‌లాండ్‌లో నిర్వహించే కేసినోను హైదరాబాద్ నుంచి పరిశీలించేలా చీకోటి ప్రవీణ్ తగిన ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆ దేశ పోలీసులు గుర్తించారు. ఏషియా పట్టాయా కన్వెన్షన్ హాల్‌లో ఆ మేరకు సీసీ కెమెరాలను థాయ్ పోలీసులు గుర్తించారు. కేసినో ఆడుతున్న వాళ్లను ప్రవీణ్ అనుచరులు హైదరాబాద్‌లో కూర్చొని పర్యవేక్షించే విధంగా అనుసంధానం చేసుకున్నట్లు థాయ్​లాండ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. డబ్బుల లావాదేవీని పకడ్బందీగా పర్యవేక్షించేలా చీకోటి ప్రవీణ్ తన అనుచరులకు హైదరాబాద్‌లో బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.

CHIKOTI PRAVEEN
CHIKOTI PRAVEEN
author img

By

Published : May 2, 2023, 8:13 PM IST

థాయ్​లాండ్​ పట్టుకున్న వారికి కోర్టు బెయిల్​ ఇచ్చింది

Thailand Gambling Case Update: థాయ్​లాండ్​లో కేసినో ఆడుతూ పట్టుబడిన 93 మందిలో తెలుగు రాష్ట్రాల నుంచి 83 మంది, ఆరుగురు థాయ్​లాండ్ వాసులు, మరో నలుగురు మయన్మార్‌ వాసులు ఉన్నారు. వీళ్లంతా ఏప్రిల్ 27వ తేదీన థాయ్‌లాండ్‌ కోన్‌బురిలోని ఏషియా పట్టాయ కన్వెన్షన్ హాల్‌లో దిగారు. హైదరాబాద్ నుంచి రవాణా ఛార్జీల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు వసూలు చేశారు. కేసినో కోసం డబ్బులు తీసుకెళ్లే అవసరం లేకుండా క్రెడిట్ నోట్స్ ఇచ్చారు. దీని కోసం ప్రత్యేక లాగ్ బుక్‌ను ప్రవీణ్, అతని అనుచరులు నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు కోన్​బురి జిల్లా పోలీస్ ఉన్నతాధికారి కాంపోల్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం దాడి చేసింది. పారిపోయేందుకు యత్నించిన వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రూ.లక్షా 60 వేలు స్వాధీనం: చీకోటి ప్రవీణ్‌తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్​రెడ్డి, మాధవరెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నారు. రూ.లక్షా 60 వేల నగదుతో పాటు 92 చరవాణీలు, ఐపాడ్, మూడు లాప్‌టాప్‌లు, 25 సెట్ల పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. కన్వెన్షన్ హాల్‌లో ఉన్న సీసీ కెమెరాలు.. హైదరాబాద్‌లో ఉన్న ల్యాప్​టాప్​లకు అనుసంధానం చేసినట్లు గుర్తించారు. బక్కారా, బ్లాక్ జాక్ ఆటలు ఆడుతున్నట్లు గుర్తించారు. గ్యాంబింగ్‌కు సంబంధించిన పరికరాలన్నీ భారత్‌ నుంచే తెచ్చుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

93 మందికి బెయిల్​ మంజూరు చేసిన కోర్టు: చీకోటి ప్రవీణ్​పై ఇప్పటికే ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది అతని ఇల్లు, ఫామ్ హౌజ్​తో పాటు చీకోటి ప్రవీణ్ వ్యాపార భాగస్వామి మాధవరెడ్డి ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా పలు పత్రాల్లో ల్యాప్​టాప్​లు స్వాధీనం చేసుకున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ మేరకు చీకోటి ప్రవీణ్‌తో బ్యాంకు లావాదేవీలు నిర్వహించిన వాళ్లకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించారు. ఈడీ కేసులో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా.. థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్​లో పట్టుబడిన 93 మందికి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విధించిన జరిమానా చెల్లించినందున పోలీసులు అందరకీ పాస్​పోర్టులను తిరిగి ఇచ్చేశారు. ఇందులో చీకోటి ప్రవీణ్, చిట్టి దేవేందర్ రెడ్డి, మాధవ రెడ్డి సహా 83 మంది తెలుగు వాళ్లు స్వస్థలాలకు బయలుదేరినట్టు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.