రాష్ట్రంలో జోనల్ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు అనంతరం ఏర్పడే ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(TGOS MEET CM KCR) వెల్లడించింది. క్రమబద్ధీకరణ తర్వాత భారీ స్థాయిలో ఉద్యోగ నియామక ప్రకటనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చెప్పారని టీజీవోల సంఘం తెలిపింది. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రిని కలిసిన టీజీవో నేతలు పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారన్న నేతలు.. వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఉద్యోగులందరూ సహకరించాలని సీఎం కోరినట్లు టీజీవోలు తెలిపారు. ఉద్యోగులకు ఐచ్ఛికాలు ఇచ్చి సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలకు కేటాయిస్తారని స్పష్టం చేశారు. అందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని టీజీవోలు తెలిపారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారన్న నేతలు.. వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సీఎంను కలిసిన వారిలో టీజీవో అధ్యక్షురాలు మమత, గౌరవాధ్యక్షుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీజీవో నేతలు ఉన్నారు.
ఇదీ చూడండి: