లాక్డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాల్లో జమచేసిన రూ.500 నగదును తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉపసంహరించుకుంది. 3 లక్షల జన్‌ధన్ ఖాతాల నుంచి రూ. 16 కోట్లకు పైగా నగదును బ్యాంకు యాజమాన్యం వెనక్కి తీసుకుంది.
జన్‌ధన్ ఖాతాల నుంచి నగదు వెనక్కి తెప్పించడం వాస్తవమేనని తెలంగాణ గ్రామీణ బ్యాంకు జీఎం మహేశ్ పేర్కొన్నారు. 2014 ఆగస్టు 1 తర్వాత ఖాతా తెరిచిన వారే పీఎంజీకేవైకు అర్హులవుతారని ఆయన తెలిపారు. అంతకు ముందు తెరచిన ఖాతాల్లో పడిన మొత్తాన్ని వెనక్కి తెప్పిస్తున్నామని వెల్లడించారు.
ఇవీచూడండి: కొహెడ పండ్ల మార్కెట్‌ను పరిశీలించిన మంత్రులు