రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో... కొత్త పరిణామాలన్నీ ఆహ్వానించదగినవేనని ప్రముఖ భూ చట్టాల రూపకల్పన నిపుణులు ఆచార్య ఎం.సునీల్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి అగ్రి భవన్ టీజీటీఏ కేంద్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి రెవెన్యూ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సుధీర్ఘ ప్రస్థానం గల రెవెన్యూ శాఖ ఉండాలా వద్దా అన్నది కాకుండా గ్యారెంటీ, బీమా, ఆర్‌ఓఆర్ స్థానంలో కొత్త చట్టం వంటి అంశాలపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలని సూచించారు. రెవెన్యూ ఉద్యోగుల పాత్ర, వ్యతిరేక కథనాలు, కొత్త చట్టంలో ఉద్యోగుల పాత్ర ఎలా ఉండాలన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. కొత్త రెవెన్యూ చట్టం అనే ప్రదిపాదన, చర్చలు కొత్తేం కాదని... 110 ఏళ్ల కిందట నుంచి కంక్లూజివ్ టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ 1960లో ఆస్ట్రేలియాలో ప్రారంభమైందని, ఆ తర్వాత అనేక దేశాల్లో సైతం అమలైందని వెల్లడించారు.
ఇవీ చూడండి: గుప్త నిధులు కావవి... రాగి నాణాలు...