ETV Bharat / state

TET Exam Telangana 2023 : రేపే 'టెట్'​ పరీక్ష.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..! - TET Exam Tips Telugu

TET Exam Telangana 2023 : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. టెట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం పేపర్ వన్.. మధ్యాహ్నం పేపర్ టూ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 78 వేల 55 మంది అభ్యర్థుల కోసం 2 వేల 52 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్ష జరగనున్న విద్యా సంస్థలకు ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపటి వరకు సెలవు ప్రకటించారు.

TET Exam
TET Notification 2023 Exam
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2023, 10:11 AM IST

TET Exam Telangana 2023 : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. టెట్ శుక్రవారం రోజున జరగనుంది. రేపు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు పేపర్ వన్.. మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ టూ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 78 వేల 55 మంది అభ్యర్థుల కోసం 2 వేల 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ రాధారాణి తెలిపారు. పేపర్ వన్​కు 2 లక్షల 69 వేల 557 మంది దరఖాస్తు చేయగా.. 1139 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. పేపర్ టూ 2 లక్షల 8 వేల 498 రాయనుండగా.. 913 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

TET Exam guidelines in Telugu : టెట్ జరగనున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం, శుక్రవారం పూర్తిగా సెలవు ప్రకటించింది. పరీక్ష కోసం 2 వేల 52 చీఫ్ సూపరింటెండెంట్లు, 22 వేల 572 మంది ఇన్విజిలేటర్లు, 10 వేల 260 మంది హాల్ సూపరింటెండెట్లను నియమించినట్లు కన్వీనర్ తెలిపారు. సీసీ కెమెరాలు, ఫర్నీచర్, నిరంతర విద్యుత్ సరఫరా, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆర్టీసీ బస్సు సదుపాయం, బందోబస్తు తదితర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను, ఆర్టీసీ, పోలీసులను కోరినట్లు పేర్కొన్నారు.

TET Exam Tips Telugu : పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రాల నుంచి అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు అనుమతించబోమని టెట్ కన్వీనర్ రాధారాణి స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని చెప్పారు. బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో ఓఎంఆర్ పత్రాల్లో సర్కిళ్లను దిద్దాలని సూచించారు. ఈనెల 27వ తేదీన టెట్ ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులంతా గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు.

Telangana Govt on Non-tax income : భారీ పన్నేతర ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం ప్రణాళిక

టెట్​ ఎందుకు అవసరం: జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనల ప్రకారం, విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలంటే తప్పనిసరిగా టెట్​లో అర్హత సాధించాలి. రాష్ట్రంలో ఇప్పటివరకు అన్ని టెట్​లు కలిపి పేపర్ 1లో లక్షన్నర.. పేపర్ 2లో రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో చివరగా గతేడాది జూన్ 12న విద్యాశాఖ టెట్ నిర్వహించింది. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్-1​లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి అయిదు తరగతులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్‌-2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు.

Telangana TeT Notification 2023 : టెట్‌ పరీక్ష దరఖాస్తుకు నేడే ఆఖరి రోజు

TET Qualified Candidates : గతేడాది జూన్ 12న జరిగిన టెట్‌ పేపర్‌-1​లో లక్ష 4 వేల 78 మంది.. పేపర్‌-2 లో లక్ష 24 వేల 535 మంది అర్హత సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2011 జూన్.. 2012 జనవరి, జూన్, 2014 మార్చిలో టెట్ నిర్వహించగా.. తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వాత 2016 మే, 2017 జులై, గతేడాది జూన్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష జరిగింది. ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయింది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష... టీఆర్టీ జరగనుంది. ఈనెల 20 నుంచి అక్టోబరు 21 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరించనున్నారు.

Indian Coast Guard Jobs : డిప్లొమా, ఇంజినీరింగ్ అర్హతతో.. ఇండియన్​ కోస్ట్​గార్డ్​లో నావిక్​, యాంత్రిక్​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

SBI PO Recruitment : ఎస్​బీఐ భారీ నోటిఫికేషన్​.. 2000 పీవో పోస్టుల భర్తీ.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.