ETV Bharat / state

TERRORISTS: ఉగ్రవాదులకు నివాసంగా మారుతున్న మహానగరం..!

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే భాగ్యనగరం ఉగ్రవాదులకు నివాసంగా మారుతోంది. పలువురు ఏళ్ళ తరబడి ఇక్కడే తిష్టవేసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నా.. పోలీసులు పసిగట్టలేకపోతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నగరంలో అడుగడుగునా సీసీటీవీలు, సమర్ధవంతమైన పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ... ఉగ్రవాదులను పట్టుకోలేకపోతున్నారు. నగరం నుంచి వెళ్లిన పార్సిల్ వల్లే దర్భంగాలో పేలుడు జరిగిందని ఎన్ఐఏ అధికారులు చెప్పే వారకు స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. కౌంటర్ ఇంటిలిజెన్స్, ఉగ్రవాద వ్యతిరేక దళాలు లేకపోవడమే ఇందుకు కారణం.

terrorists-in-hyderabad
ఉగ్రవాదులకు నివాసంగా మారుతున్న మహానగరం..!
author img

By

Published : Jul 4, 2021, 1:49 PM IST

Updated : Jul 4, 2021, 2:11 PM IST

రాజధాని నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలు కలకలం సృష్టిస్తున్నాయి. మల్లేపల్లిలో జాతీయ దర్యాప్తు బృందం ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇంకా నగరంలో ఎంత మంది ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో తెలంగాణ పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదిహేనేళ్ల నుంచి రాష్ట్ర పోలీసులు ఒక్కరంటే ఒక్క ఉగ్రవాదిని పట్టుకోలేకపోయారు. రైల్వేస్టేషన్​లో పేలుడుకు కారణమైన నసీర్ మాలిక్ ఇరవై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా... అహ్మదాబాద్​లో వరుస పేలుళ్లలో నిందితుడు, లష్కరేతోయిబా ఉగ్రవాది గులాం జాఫర్ పన్నెండేళ్లుగా టోలీచౌకీలో "లేటెస్ట్ లేడీస్ టైలర్" పేరుతో దుకాణం నిర్వహిస్తున్నా పోలీసులకు తెలీదు. దేశంలో విధ్వంసాలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న ఉగ్రవాదులు, సానుభూతిపరులు నగరాన్ని సురక్షిత ఆశ్రయంగా ఎంచుకుంటున్నారు. హైదరాబాద్​తో పాటు శివారు ప్రాంతాల్లో ఉత్తరాదివారితో పాటు విదేశీయులు వేల సంఖ్యలో నివాసముండటం వీరికి కలిసి వస్తోంది. పాతబస్తీ, టోలీచౌకీ, మెహిదీపట్నం, బంజారాహిల్స్, పహడీషరీఫ్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి ప్రాంతాలను ఉగ్రవాదులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు.

మనలోనే ఉంటూ..

లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిదీన్, హుజీ, ఐసిస్ ఉగ్రవాద సంస్థల సభ్యులు ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్నారు. వేర్వేరు వృత్తులు చేసుకుంటూ చుట్టుపక్కల వారితో స్నేహంగా ఉంటూనే ఉగ్రవాద సంస్థల సానుభూతి పరులకు రహస్యంగా సమాచారాన్ని చేరవేస్తున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా, చరవాణులు ట్రాక్ చేయకుండా రూట్ కాలింగ్, శాటిలైట్ ఫోన్ల ద్వారా మాట్లాడుతున్నారు. మూడేళ్ల నుంచి స్ఫూఫింగ్ యాప్స్ సాయంతో ఉగ్ర సంస్థల నాయకులతో మాట్లాడున్నారు. గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో విధ్వంసం అనంతరం ఇప్పటి వరకూ 54 మంది ఉగ్రవాద సంస్థల సభ్యులు, సానుభూతిపరులను ఇతర రాష్ట్రాల పోలీసులు, నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి.

హైదరాబాద్​లో అరెస్టులు...

  • సిరియా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐసిస్​కు వేర్వేరు రంగాలకు చెందిన వ్యక్తులు సానుభూతిపరులుగా ఉన్నారు. వీరని జాతీయ దర్యాప్తు సంస్థ ఐదేళ్ల క్రితం గుర్తించింది. ఓ సాఫ్ట్​వేర్ ఇంజినీర్ సహా నలుగురిని అరెస్ట్ చేసింది.
  • హర్కతుల్ జిహాదీ అల్ ఇస్లామీ (హుజీ) ఉగ్రవాద సంస్థ సభ్యులు, సానుభూతి పరులు విధ్వంసాలు, హత్యలకు ప్రణాళికలను రచించారు. సాధారణ పౌరుల్లా చార్మినార్, గోల్కొండ, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో సంచరించారు. బెంగుళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వీరిని తొమ్మిదేళ్ల క్రితం అరెస్ట్ చేశారు.
  • గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో బాంబులు అమర్చి విధ్వంసం సృష్టించిన ఉగ్రవాదులు తార్నాక ప్రాంతంలో ఓ గది అద్దెకు తీసుకుని నివాసమున్నారు. అంతేకాదు ఓ ఉగ్రవాది ప్రైవేటు జూనియర్ కళాశాలలో విద్యార్థిగా నకిలీ గుర్తింపు కార్డు తయారు చేసుకున్నాడు.
  • దిల్​సుఖ్ నగర్ జంట పేలుళ్లలో 48 మంది మృతికి కారకులైన ఉగ్రవాదుల్లో ఇద్దరు ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లోని ఓ లాడ్జిలో కొద్ది రోజుల పాటు నివాసమున్నారు. మరో ఉగ్రవాది దిల్‌సుఖ్ నగర్ బస్ డిపో వెనుక ఓ గదిలో నెల రోజుల పాటు ఉన్నాడు.

ఇన్ని జరిగినా రాష్ట్ర పోలీసులు మాత్రం వీరిని పట్టుకోలేకపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. ప్రత్యేక నిఘా బృందం, ఉగ్రవాద వ్యతిరేక దళం, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలను ఏర్పాటు చేస్తే విధ్వంసాలు జరగకుండా చర్యలు తీసుకోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: DARBHANGA BLAST: భాగ్యనగర కేంద్రంగా ‘ఉగ్ర’ దర్యాప్తు!

Last Updated : Jul 4, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.