BJP Office security: భాజపా రాష్ట్ర కార్యాలయానికి 'ఉగ్ర' ముప్పు ఉందని సమాచారం రావడంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు పార్టీ ముఖ్యనేతలను హెచ్చరించారు. పార్టీతో సంబంధం లేని వ్యక్తులు కార్యాలయానికి వచ్చి వెళుతున్నారని గుర్తించినట్లు సమాచారం అందించారు. పార్టీపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గతంలో కూడా ఒకటి, రెండుసార్లు ఇంటెలిజెన్స్ అధికారులు ఇలాంటి హెచ్చరికలు చేసినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో స్థానిక అబిడ్స్ పోలీసులు భద్రత కల్పించే విషయంపై దృష్టి సారించారు. కార్యాలయ ప్రధాన గేటు ముందు ఉన్న చెట్టు కొమ్మలను తొలగించారు. మరింత భద్రత కల్పించేందుకు మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు భద్రత పెంచే విషయంపై చర్చిస్తున్నారు.
ఇదీ చదవండి: