తెరాస భాజపాకు అన్ని విధాలుగా వ్యతిరేకమైన పార్టీ అని జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. కేసీఆర్ గెలుస్తున్న ప్రతి గెలుపులో ఓటమి ఉందన్నారు. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ గెలిచాననుకోవడం సరైంది కాదని చెప్పారు. ఒవైసీ భూతం పట్టినప్పుడల్లా కేసీఆర్ సెక్యులరిజం మాట్లాడుతున్నారని విమర్శించారు. రాంమాధవ్, తాను ఇక్కడి వారమే అయినా తమ లక్ష్యం తెలుగు రాష్ట్రాలపైన లేదన్నారు.
మహిళల మీద నేరాలకు మద్యపానం కారణమనేది సరైంది కాదని అన్నారు. జాతీయ స్థాయిలో మద్యపానంపై ఎలాంటి విధానం తీసుకోలేదని వివరించారు. దక్షిణాదిలో కాంగ్రెస్ పతనమైందని తిరిగి పుంజుకునే పరిస్థితిలో లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి : 'హిందువులకు తెరాస క్షమాపణ చెప్పాలి'