రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదో తరగతి పరీక్షలపై అనుసరించాల్సిన వ్యూహం.. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ మినహా... మిగతా ప్రాంతాల్లో పరీక్షలు జరుపుకోవచ్చునని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాని ప్రాంతాల వారీగా వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తే సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని.. ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ వంటి ప్రవేశాల ప్రక్రియలో గందరగోళం తలెత్తుతుందని విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించాలని లేదా పూర్తిగా రద్దు చేసి పరీక్షలు లేకుండానే గ్రేడింగ్ ఇవ్వాలని ప్రభుత్వానికి విద్యాశాఖ సూచించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా - ssc exams news
20:23 June 06
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా