రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుండడం వల్ల రేపటి నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ్టి వరకు జరగాల్సిన పరీక్షలను మాత్రమే గతంలో వాయిదా వేశారు. కరోనాను నివారించడానికి లాక్డౌన్ విధించడం వల్ల రేపటి నుంచి ఏప్రిల్ 6 వరకు జరగనున్న పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.సత్యనారాయణ రెడ్డి తెలిపారు. పదో తరగతి పరీక్షల తదుపరి తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.
పదో తరగతి పరీక్షలు వాయిదా వేసినట్టు ప్రభుత్వం హైకోర్టుకి నివేదించింది. పరిస్థితులు చక్కబడే వరకు పరీక్షలు వాయిదా వేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదీ చూడండి:- తల్లి పాల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందా?