ఏపీలో ఛలో రామతీర్థానికి బయల్దేరిన భాజపా - జనసేన శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోలీసుల తీరును ఇరు పార్టీల నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. వైకాపా, తెదేపా నేతలను అనుమతించి.. తమను ఎందుకు పంపించడం లేదంటూ వాగ్వాదానికి దిగారు. ఎంతకూ పోలీసులు వారిని అనుమతించకపోవడం.. ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, భాజపా నేతల మధ్య తోపులాట జరిగింది.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా.. రామతీర్థం పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
ఇదీ చదవండి: హైకోర్టు సీజేగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణస్వీకారం