ETV Bharat / state

భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ముట్టడికి యత్నించిన నేతల అరెస్ట్​ - ts news

BJP Office Muttadi: భాజపా రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు గిరిజన సంఘాల నేతలు యత్నించారు. ఈ నేపథ్యంలో గిరిజన సంఘాల నేతలను భాజపా యువ మోర్చా నేతలు అడ్డుకోగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ముట్టడికి యత్నించిన నేతల అరెస్ట్​

author img

By

Published : Mar 23, 2022, 6:05 PM IST

BJP Office Muttadi: తెరాస-భాజపా శ్రేణుల మధ్య వివాదాలు మరింత ముదురుతున్నాయి. భాజపా కార్యాలయం ముట్టడికి గిరిజన సంఘాలు యత్నించగా.. కమలం శ్రేణులు అడ్డుకోగా ఉద్రిక్తత తలెత్తింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్‌ను 12శాతానికి పెంచాలన్న ప్రతిపాదన రాలేదని కేంద్రం ప్రకటించడాన్ని నిరసిస్తూ తెరాస నేత గెల్లు శ్రీనివాస్ నేతృత్వంలో గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి.

గిరిజన సంఘాల నేతలను భాజపా యువ మోర్ఛా నేతలు అడ్డుకోగా.. పరస్పరం ఘర్షణ, తోపులాట జరిగింది. గిరిజన సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి పరిస్థితిని అదుపు చేశారు. భాజపా కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఆ కార్యాలయం వెళ్లే దారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఇది కేసీఆర్​ కుట్రలో భాగమే..

ఇందులోకి అనవసరంగా అమాయక ప్రజలు, ఎస్సీలు ఎస్టీలను తీసుకురావద్దు. కేసీఆర్​ కుట్రలో ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలు భాగస్వామ్యం కావద్దు. కావాలనే సీఎం కేసీఆర్​ తన వైఫల్యాలను, ప్రజా వ్యతిరేకతను ఈ విధంగా భాజపా కార్యాలయంపై దాడి చేయించి రూటు మార్చే ప్రయత్నం చేస్తుండు. కచ్చితంగా దీనికి ప్రతి సమాధానం భాజపా ఇస్తుందని హెచ్చరిస్తున్నాం. -భాజపా యువ మోర్ఛా నేత

భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ముట్టడికి యత్నించిన నేతల అరెస్ట్​

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.