ETV Bharat / state

జగన్​ ఎన్ని కుతంత్రాలు పన్నినా.. యువగళం పాదయాత్ర ఆగదు: లోకేశ్​ - లోకేశ్​ వార్తలు

Nara Lokesh Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే బంగారుపాళ్యంలో లోకేశ్​ సభ నిర్వహిస్తున్న ప్రాంతానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అసలేం జరిగిందంటే..

Nara Lokesh Padayatra
Nara Lokesh Padayatra
author img

By

Published : Feb 3, 2023, 6:01 PM IST

Updated : Feb 3, 2023, 8:49 PM IST

Lokesh Padayatra: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా బంగారుపాళ్యంలో లోకేశ్​ సభ జరుగుతోంది. దీంతో పోలీసులు​ భారీ ఎత్తున అక్కడకు చేరుకుని..బహిరంగ సభకు అనుమతి లేదని లోకేశ్​ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మరోవైపు బహిరంగసభకు అనుమతి ఇవ్వాలని టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. మరోవైవు పోలీసులు లోకేశ్ మూడు వాహనాలు సీజ్ చేశారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇదేవిధంగా సభకు అనుమతి లేదని నిన్న లోకేశ్​ ప్రచారరథాన్ని పోలీసులు ఆపారు. లోకేశ్​ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో నోటీసులిచ్చారు. లోకేశ్ సభాస్థలానికి​ రావటానికి ముందు పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. లోకేశ్​ సభను నిర్వహంచకుండా ఉండేందుకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. పోలీసుల అడ్డంకుల్ని దాటుకుని లోకేశ్​ సభ నిర్వహించారు. పోలీసుల అడ్డంకుల్ని దాటుకుని వెళ్లటమే కాకుండా.. కార్యకర్తల సహకారంతో ఓ భవనంలోకి వెళ్లి ప్రసంగించారు. ఆ ప్రాంతంలో అధికారులు విద్యుత్​ సరఫరాను నిలిపివేశారు.

జగన్​ ఎన్ని కుతంత్రాలు పన్నినా యువగళం పాదయాత్ర ఆగదని​ లోకేశ్​ స్పష్టం చేశారు. పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే సహించబోమని లోకేశ్​ మండిపడ్డారు. పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని లోకేశ్​ హెచ్చరించారు.

వంద కి.మీ. మైలురాయి..: నారా లోకేశ్​ పాదయాత్ర వంద కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. దీనికి గుర్తుగా బంగారుపాళ్యంలో మైలురాయి శిలాఫలకాన్ని లోకేశ్​ ఆవిష్కరించారు.

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా బంగారుపాళ్యంలో లోకేశ్​ సభ జరుగుతోంది. దీంతో పోలీసులు​ భారీ ఎత్తున అక్కడకు చేరుకుని..బహిరంగ సభకు అనుమతి లేదని లోకేశ్​ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మరోవైపు బహిరంగసభకు అనుమతి ఇవ్వాలని తెదేపా శ్రేణులు నినాదాలు చేశారు. ఇదేవిధంగా సభకు అనుమతి లేదని నిన్న లోకేశ్​ ప్రచారరథాన్ని పోలీసులు ఆపారు. లోకేశ్​ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో నోటీసులిచ్చారు. తాజాగా పోలీసులు లోకేశ్​ ప్రసంగాన్ని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఇవీ చదవండి :

Last Updated : Feb 3, 2023, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.