ETV Bharat / state

17 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు

నాడు.. స్వచ్ఛమైన నీటితో పంటపొలాల్ని సస్యశ్యామలం చేసిన మూసీ నేడు దేశంలోని అత్యంత కాలుష్యమైన నదుల్లో నాలుగో స్థానంలో ఉంది. ఈ నది దుస్థితిని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తీవ్రంగా పరిగణించడంతో.. పీసీబీతో పాటు రెవెన్యూ, పురపాలక (జలమండలి, జీహెచ్‌ఎంసీ) శాఖలు నది ప్రక్షాళనకు కార్యాచరణ రూపొందించాయి.

musi river news
17 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు
author img

By

Published : Sep 28, 2020, 8:30 AM IST

మూసీలో కలిసే మురుగునీటిని శుద్ధి చేసేందుకు జలమండలి ఎస్టీపీ (మురుగునీటి శుద్ధికేంద్రం)ల నిర్మాణానికి సిద్ధం అవుతోంది. వారంలో టెండర్లను పిలవబోతోంది. నెలాఖరు లేదా అక్టోబరు నుంచి ఈ ప్రక్రియ కార్యాచరణ చేపట్టనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.

65 నుంచి 17 ఎస్టీపీలు..

365 ఎంఎల్‌డీల మురుగునీటి శుద్ధి

మురుగునీరు నేరుగా మూసీలో కలుస్తుండటంతో కాలుష్యం పెరుగుతోంది. హైదరాబాద్‌లో 1,800 ఎంఎల్‌డీ మురుగునీరు వస్తోంది. ఇందులో ప్రస్తుతం 700 ఎంఎల్‌డీల మురుగునీటినే శుద్ధి చేస్తున్నారు. రానున్న 30 సంవత్సరాల అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని 65 ఎస్టీపీ (మురుగునీటి శుద్ధికేంద్రం)ల నిర్మాణం చేపట్టాలని జలమండలి నిర్ణయించింది. నిధుల సమస్య కారణంగా ప్రస్తుతానికి 17 ఎస్టీపీలకు కుదించింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ వంటి ప్రాంతాల్లో 17 ఎస్టీపీలతో రోజు 365 ఎంఎల్‌డీల మురుగునీటిని శుద్ధి చేయాలన్నది లక్ష్యం. రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ఎస్టీపీలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది.

కొద్దిరోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు పాతనగరంలో ఆసిఫ్‌నగర్‌, మరికొన్ని ప్రాంతాల నుంచి వచ్చే మురుగు మూసీలో కలవకుండా రూ.250 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ ఆధునికీరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2022 మే నాటికి ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. కాలుష్యం బారిన పడ్డ మూసీ తీరప్రాంతాలను పునరుజ్జీవింపజేసే ప్రణాళికను పీసీబీ.. సీసీసీబీ ద్వారా ఎన్జీటీకి ఇప్పటికే అందించింది. రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టును 51 కిలోమీటర్ల దూరం.. 3 దశల్లో చేపట్టనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.