కొవిడ్-19ను తక్షణమే ఆరోగ్య శ్రీలో చేర్చాలని తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ తెలుగు యువత డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం చందర్ అధ్వర్యంలో కార్యకర్తలు 48గంటల నిరాహార దీక్ష చేపట్టారు. కరోనా నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి సీఎం కేసీఆర్ నీటి సమస్యను ముందుకు తెస్తున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేవలం నలుగురు వ్యక్తులతోనే పాలన సాగుతుందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో నడుస్తున్న నియంత పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడుతారని జయరాం అభిప్రాయపడ్డారు. తెరాస ఆరేళ్ల పాలనలో ఒక్క ఆసుపత్రి కూడా నిర్మించలేదని... నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే రాష్ట్రంలోని ఆసుపత్రులను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించి ప్రజల ముందుకు తీసుకువెళ్తామన్నారు.
ఇవీ చూడండి: ఈనాడు కథనానికి 'స్పందన'.. వృద్ధురాలికి స్వేచ్ఛ