ETV Bharat / state

ఆదర్శం: అమెరికాలో ఉన్నత స్థాయిలో తెలుగు తేజం

ఐటీ సంస్థల్లో ఉన్నత స్థానాల్లోని తెలుగువారి పేర్లు అప్పుడప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. కానీ వారిలో ఎక్కువగా పురుషులే ఉంటారు. సవాళ్లతో కూడిన ఈ రంగంలో మహిళలు, అందులోనూ తెలుగువాళ్లు తక్కువే. అలాంటిచోట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు విశాఖకు చెందిన రాధిక తమ్వాద. 'ఫోన్‌ పే'లో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రొడక్ట్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న రాధిక ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి పాఠం...

telugu woman from microsoft till phonepay head
'మెక్రోసాఫ్ట్​ నుంచి ఫోన్​పే వరకు.. ప్రత్యేక సవాళ్లతో ఎదిగా'
author img

By

Published : Jul 2, 2020, 12:33 PM IST

ఆడపిల్లల చదువులు, ఉద్యోగాలూ కుటుంబ బాధ్యతలకు అడ్డుతగలకుండా ఉండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. ఇందుకు మావాళ్లూ మినహాయింపు కాదు. మా సొంతూరు విశాఖపట్నం. ఆంధ్రాబ్యాంకు చీఫ్‌ మేనేజరు రాజేశ్వరరావు, లీలా దంపతులకు ఏకైక కూతుర్ని. అక్కడే సెయింట్‌ మేరీస్‌ స్కూల్లో పదో తరగతి వరకూ చదువుకున్నా. నాన్నకు కాకినాడ బదిలీ అవడంతో ఇంటర్మీడియెట్‌ అక్కడి ప్రగతి కాలేజీలో చదివా.

ఆపైన జేఎన్‌టీయూ కాకినాడలో 'ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌' చేశా. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో సునాయాసంగానే ఉద్యోగం దొరికింది. ఉన్నత చదువులపైన నాకు ఆసక్తి ఉండటంతో ఎం.ఎస్‌.కు దరఖాస్తు చేశా. వర్జీనియా టెక్‌ యూనివర్సిటీలో సీటు కూడా వచ్చింది. కానీ ఇంట్లో వద్దనడంతో ఉద్యోగంలోనే చేరాను. 2002నుంచి రెండేళ్లపాటు హైదరాబాద్‌లోని 'మెన్సామైండ్‌'లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశా.

మైక్రోసాఫ్ట్​, గూగుల్​లో..

ఉద్యోగం చేస్తుండగానే అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన ప్రశాంత్‌తో వివాహం కావడంతో నేనూ అక్కడికి వెళ్లా. తొలి ప్రయత్నంలోనే మెక్రోసాఫ్ట్‌లో 'సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌ ఇంజినీర్‌'గా అవకాశం వచ్చింది. అదే సమయంలో యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లో ఎం.ఎస్‌. సీటూ వచ్చినా వదులుకుని ఉద్యోగంలోనే కొనసాగా. విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో పని చేయటం, మేం రూపొందించిన ప్రోగ్రామ్‌లు కోట్లాది మంది ఉపయోగించటం... ఓవైపు వింతగా, మరోవైపు గర్వంగా అనిపించేది. గూగుల్‌లో 'టెక్‌ లీడ్‌'గా ఆఫర్‌ రావడంతో 2006లో అందులో చేరా. అక్కడ దాదాపు పదేళ్లు పనిచేశా. ప్రోగ్రామింగ్‌ బోర్‌కొట్టి మధ్యలో ప్రొడక్ట్‌ విభాగంవైపు మారాను.

2010లో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా అవకాశం దక్కింది. ప్రొడక్షన్‌లో కెరీర్‌ కొనసాగాలంటే ఎంబీఏ అయినా ఉండాలీ లేదంటే, నన్ను ప్రోత్సహిస్తూ యాజమాన్యం దగ్గర నా గురించి చెప్పగలిచే మెంటారైనా ఉండాలి. నాకు అలాంటి అవకాశం దొరకలేదక్కడ. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తులు అందజేసేదాన్ని. వారినుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటూ ప్రొడక్ట్‌లో మార్పులు చేసేదాన్ని. బహుశా ఈ విభాగంలో నేను విజయవంతమవడానికి కారణాలివే. గూగుల్‌లో పీపుల్‌ సర్చ్‌, సోషల్‌ గ్రాఫ్‌, రియల్‌టైమ్‌ కమ్యూనికేషన్స్‌... విభాగాల్లో పనిచేశా. రెండు పేటెంట్లూ తీసుకున్నా.

ఇండియాలో ఫ్లిప్​కార్ట్​తో..

2015లో ఇండియా తిరిగొచ్చాక ఫ్లిప్‌కార్ట్‌లో చేరాను. నేను చేరకముందు కంపెనీ విక్రయాల్లో కస్టమర్‌ రిలేటెడ్‌ నోటిఫికేషన్ల ద్వారా వచ్చేవి పది శాతం ఉండేవి. మిషన్‌ లెర్నింగ్‌ విధానంతో నేను రూపొందించిన ప్రొడక్ట్‌తో ఏడాదిలో అది 40 శాతానికి పెరిగింది. ముందువాళ్లకంటే డేటాని మరింత వేగవంతంగా, కచ్చితంగా ఉపయోగించడంవల్ల నాకది సాధ్యమైంది. గతేడాది ప్రారంభంలో నాకు ఫ్లిప్‌కార్ట్‌ సిస్టర్‌ కంపెనీ అయిన 'ఫోన్‌ పే'లో కొత్త బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు వరకూ అప్పటికే ఉన్న వ్యవస్థల్ని నా సామర్థ్యంతో మరింత వృద్ధిలోకి తీసుకొచ్ఛా అవన్నీ ఆన్‌లైన్‌ ప్రొడక్ట్‌లు. కానీ కొత్త బాధ్యతలు వాటికి పూర్తి భిన్నం.

డిజిటల్‌ చెల్లింపులకే పరిమితమైన ఫోన్‌ పే... ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగంలోకి అడుగుపెట్టాలనుకుంది. దానికి ప్రొడక్ట్‌ హెడ్‌గా నన్ను నియమించారు. మా మొదటి ప్రొడక్ట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ విభాగంలో తేవాలనుకున్నాం. దీని గురించి ఆరు నెలలు శ్రమించాను. ఒక ఏజెన్సీ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌ని లోతుగా అధ్యయనం చేశా. తర్వాత వైజాగ్‌ సహా చాలా పట్టణాలు తిరిగి... వినియోగదారుల పొదుపు, మదుపు అలవాట్లని తెలుసుకుని పదిమంది సాఫ్ట్‌వేర్‌ ఇంజీనీర్లతో ప్రొడక్ట్‌ని తీసుకొచ్ఛా ఖాతా తెరవడానికి అవసరమైన 30 అంశాలతో కూడిన 'కేవైసీ'ని మూడు దశలకు తగ్గించాం. ఆ ప్రొడక్ట్‌ విజయవంతమైంది. ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొడక్ట్‌ మీద పనిచేస్తున్నాం.

ఈ రంగంలో రాణించాలంటే మార్గదర్శి ఉండటం తప్పనిసరి. కానీ నాకు ఆ అవకాశం రాలేదు. అయినా పట్టుదలతో ముందుకు వెళ్లగలిగాను. రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ అవసరమైన ప్రతిసారీ నా సలహాలు ఉత్తమ ఫలితాలివ్వటంతో నాపై యాజమాన్యానికి విశ్వాసం పెరిగేది. గూగుల్‌లో సీనియర్‌ మహిళా ఇంజినీర్లను జూనియర్లకు మెంటార్‌లుగా అనుసంధానించేవాళ్లం. మన దగ్గరా ఆ సంస్కృతి రావాలి. ఏ స్థాయిలో ఉన్నా మహిళలకు ఆత్మవిశ్వాసం ఉన్నపళంగా సన్నగిల్లే బలహీనత ఉంటుంది. ముఖ్యంగా చిన్న విజయాలకూ సంతృప్తి పడతారు. వీటన్నింటినీ దాటి నా పరిధిని నేనే విస్తరించుకుంటూ వచ్చా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.