ETV Bharat / state

విదేశాల్లో విద్యార్థుల విలవిల... ఆపన్నహస్తం అందిస్తున్న ప్రవాసీయులు

తమ కలలను సాకారం చేసుకునేందుకు.. ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్లిన విద్యార్థులు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నారు. ఓ పక్క చదువుకుంటూ.. మరోపక్క తాత్కాలిక ఉద్యోగం చేసుకుంటూ జీవించే వీరు ప్రస్తుతం తినడానికి తిండి లేక.. ఖర్చులకు డబ్బులు లేక తీవ్ర అగచాట్లకు గురువుతున్నారు.

author img

By

Published : Apr 13, 2020, 8:12 AM IST

telugu students problems in other countries
విదేశాల్లో విద్యార్థుల విలవిల... ఆపన్నహస్తం అందిస్తున్న ప్రవాసీయులు

మన దేశం నుంచి ఏటా 7 లక్షల మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు పయనమవుతుంటారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే రెండు లక్షల మంది వరకు ఉంటారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఉక్రెయిన్‌, బ్రిటన్‌, న్యూజిలాండ్‌ తదితర దేశాలకు వెళుతుంటారు. సెమిస్టర్ల ఫీజులు, నెలవారీ ఖర్చుల భారం తల్లిదండ్రులపై పడకుండా ఉండేందుకు చదువుకుంటూనే... రోజుకు 2-3 గంటల చొప్పున పార్ట్‌టైం ఉద్యోగాల్లో చేరతారు.

కరోనా వ్యాప్తి నివారణకు ఆయా దేశాల్లో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో కళాశాలల్లో తరగతులు నిలిచిపోయాయి. పార్ట్‌టైం కొలువులూ పోయాయి. కొన్ని దేశాల్లోని ప్రభుత్వాలు స్థానికులకే సహాయం చేస్తుండటంతో.. మన విద్యార్థులు నెలవారీ ఖర్చులకు తెలిసినవారి దగ్గర అప్పు తీసుకోవడం లేదంటే తల్లిదండ్రులను అడగడమో చేస్తున్నారు. ‘‘అమెరికాలో నివాస ప్రాంతాన్ని బట్టి విద్యార్థులకు నెలకు 600-1000 డాలర్లు ఖర్చుంటుంది. లాక్‌డౌన్‌తో పార్ట్‌టైం కొలువులు పోవడంతో విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి’’అని చికాగోలో ఐటీ ఉద్యోగి సాయిప్రసాద్‌ ‘పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులకు తెలుగు సంఘాలు, పంజాబీ, గుజరాతీ, మరాఠీ సంఘాలు దన్నుగా నిలుస్తున్నాయి. కళాశాల ఐడీ కార్డులు చూసి సిడ్నీ నగరం, శివారు ప్రాంతాల్లోని భారతీయ రెస్టారెంట్లలో రోజూ ఉచితంగా భోజనం అందిస్తున్నట్లు ఓ విద్యార్థి తెలిపాడు.

నెలకు వెయ్యి డాలర్ల ఖర్చు

విక్టోరియా రాష్ట్రంలో.. మెల్‌బోర్న్‌ వంటి నగరాల్లో కొవిడ్‌-19 ప్రభావం బాగా ఉంది. సరైన కారణం లేకుండా బయటికెళితే 650 డాలర్ల జరిమానా వేస్తున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌ ప్రాంతాలకు చెందిన ఏడుగురు విద్యార్థులం ఒకే గదిలో ఉంటున్నామని... పార్ట్‌టైం జాబ్‌తో నెలకు 1,500-2,000 డాలర్ల ఆదాయం వస్తుందని ఎంఎస్ విద్యార్థి సాయిచరణ్ తెలిపాడు. ఉద్యోగం పోయినవాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విద్యారుణం, ఆరోగ్యబీమా ప్రీమియం కట్టలేక, అద్దె, భోజన ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర సేవలందించే సంస్థలో పనిచేస్తుండటంతో నా కొలువు మాత్రం ఉంది. నా స్నేహితులతో పాటు ఆస్ట్రేలియాలో చాలామంది భారతీయ విద్యార్థుల్ని ఉద్యోగాల నుంచి తొలగించారు. మా తొలిప్రాధాన్యం దేశపౌరులు, శాశ్వతపౌరులని.. విదేశీ విద్యార్థులను సొంత దేశాలకు వెళ్లాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం సలహా ఇచ్చిందని పేర్కొన్నాడు.

విద్యార్థులపైనే అధిక ప్రభావం..

ఆస్ట్రేలియాలో కరోనా ప్రభావం విదేశీ విద్యార్థుల మీదే ఎక్కువుంది. వ్యాపారులకు ప్యాకేజీ, అందులో పనిచేసే స్థానిక ఉద్యోగులకు నెలకు 3 వేల డాలర్ల చొప్పున ఆస్ట్రేలియా ప్రభుత్వం సాయం ప్రకటించింది. స్టూడెంట్‌ వీసాపై వచ్చినవారికి, పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నవారికి మద్దతు లేదు. ఆర్థికంగా ఇబ్బంది పడే విద్యార్థులు సొంత దేశాలకు వెళ్లాలంటోంది. విద్యార్థుల కష్టాలు చూసి ఉచిత ఆహారం, ఆర్థికసాయం రూపంలో ప్రవాస భారతీయులు అండగా నిలుస్తున్నారు. సిడ్నీ రాజధానిగా ఉన్న ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్రంలో 3 నెలలు లాక్‌డౌన్‌ ప్రకటించారు.

తల్లిదండ్రులే డబ్బు పంపుతున్నారు

లాక్‌డౌన్‌తో కళాశాలకు, బయటకు వెళ్లడం లేదు. ప్రొఫెసర్‌ వద్ద గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్‌గా పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నామని ఎంఎస్ విద్యార్థిని అఖిత తెలిపింది. నాతో పాటు ఉండే ఐదుగురు స్నేహితురాళ్లకు ఇప్పుడు పార్ట్‌టైం జాబ్‌ చేసే పరిస్థితి లేదు. బంధువులు, తల్లిదండ్రుల నుంచి డబ్బు తమ ఖాతాల్లో వేయించుకుంటున్నారని వెల్లడించింది.

ఇవీ చూడండి: వైద్యుల కోసం రక్షణ పరికరాన్ని ఆవిష్కరించిన టీ-వర్క్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.