ఖండాంతరాలు దాటి వైద్య విద్య కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దేశం కాని దేశంలో పడరాని పాట్లు పడుతున్నారు. కిర్గిస్థాన్ దేశంలోని ఏషియన్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 235 మంది విద్యార్థులు వైద్య విద్య అభ్యసిస్తున్నారు. కరోనా ప్రభావంతో దేశం విడిచి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. స్వదేశం రావడానికి సత్పాల్ అనే ఓ ఏజెంట్‌కు టిక్కెట్ల కోసం ఒక్కో విద్యార్థి 45 వేల నుంచి 50 వేల వరకు డబ్బు చెల్లించారు. విద్యార్థులు విమానాశ్రయానికి చేరుకున్నాకా... ఆ దేశ రాయబార కార్యాలయం అధికారులు అనుమతి నిరాకరించగా... విమానం రద్దయినట్టు ఏజెంట్ విద్యార్థులకు తెలిపాడు.
వసతి గృహాలను ఖాళీ చేసి... విమానాశ్రయానికి వచ్చామని విమానం లేదని తెలియడం వల్ల రోడ్డుపైనే ఉండాల్సి వస్తోందని ఆవేదన చెందారు. సౌకర్యాలు కూడా లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకొని తమను గమ్యస్థానాలకు చేర్చాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు