ETV Bharat / state

తెలుగు పుటలో చెరగని సంతకం - jagan

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారిగా... ఓ ముఖ్యమంత్రి వారసుడు.. ముఖ్యమంత్రిగా ఎదిగారు. దివంగతనేత  వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా.. ఆయన తనయుుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. తండ్రి.. కొడుకులు ముఖ్యమంత్రిగా పాలన అందించడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రప్రథమం..

జగన్​
author img

By

Published : May 30, 2019, 4:53 PM IST

Updated : May 30, 2019, 5:07 PM IST

తెలుగు పుటలో చెరగని సంతకం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన వైకాపా అధినేత వైఎస్ జగన్.. విజయవాడ వేదికగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్ ఓ అరుదైన ఘనతను సొంత చేసుకున్నారు. ఓ ముఖ్యమంత్రి కొడుకుగా.. ఏపీకి సీఎం అయ్యారు. ఓటమి ఎరుగని నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డి .. రాజకీయ ప్రస్థానం అందరికీ సుపరిచితమే! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన.. రాజకీయాల్లో తిరుగులేని నేతగా చెరగని ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన నేతగా.. పేరు సంపాదించుకున్నారు.

ఎదురించి పోరాడిన జగన్​

ఘోర ప్రమాదంలో వైఎస్​ అర్థాంతరంగా చనిపోయినా.. ఆయనను అభిమానించే జనం.. తెలుగు రాష్ట్రాల్లో మెండుగా ఉన్నారు. ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు యెడుగూరి సందింటి జగన్​మోహన్ రెడ్డి. తండ్రి మరణం.. తదనంతర పరిణామాలతో చిక్కుల్లో పడ్డారు. ఆ తర్వాత ఏకంగా కాంగ్రెస్ అధిష్ఠానాన్నే ఎదిరించి... సొంతగా పార్టీని స్థాపించారు. కొడితే కుంభస్థలమే అంటూ.. ముఖ్యమంత్రి పదవిపై దృష్టి పెట్టారు. తొమ్మిదేళ్లుగా అలుపెరుగని పోరాటం సాగించారు. మొదటి దఫా..సీఎం పదవి అందినట్లే అంది.. చేజారి పోయినా.. నిరాశ పడకుండా.. దండయాత్ర కొనసాగించారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించి.. నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఓ సీఎంకు కొడుకుగా.. ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసి తెలుగు నేలపై ఓ సరికొత్త రికార్డును సృష్టించారు.

వైఎస్ బాటలోనే...

జగన్ కూడా తండ్రి బాటలోనే రాజకీయ అడుగులు వేశారు. వైఎస్ సొంత పార్టీలోనే నిరంతరం సంఘర్షిస్తూ.. తన సొంత బలాన్ని పెంచుకుంటే. జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చి.. సొంత ముద్ర వేసుకున్నారు. వైఎస్ తరహాలోనే ఎప్పుడూ .. చిరునవ్వుతో కనిపిస్తూ.. తండ్రి విజయ రహస్యాన్ని ఆయుధంగా మలచుకున్నారు. ఆయన బాటలోనే నడిచారు.

తండ్రి మరణంతో...

వైఎస్ రాజశేఖర్​ రెడ్డి వారసుడిగా 2009 ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు జగన్. అదే ఏట కడప ఎంపీగా గెలుపొందారు. కానీ కొద్ది నెలల వ్యవధిలోనే.. సెప్టెంబర్ 2న వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. తండ్రి మరణంతో చనిపోయిన వారిని పరామర్శించేందుకు చేపట్టిన ఓదార్పు యాత్రతో కాంగ్రెస్ అధిష్ఠానంతో దూరం పెరిగింది. తదనంతర పరిణామాలతో జగన్ పార్టీని వీడి..సొంతపార్టీ పెట్టుకున్నారు. 2014లో అధికారం దగ్గరకొచ్చి నిలిచిపోయారు. ఈ దఫా తండ్రి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర స్పూర్తితో... ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారు. 3600 కిలోమీటర్లు నడిచి తండ్రిని మరిపించారు. ఎట్టకేలకు.. ఆయన వారసుడిగా ఇప్పుడు సీఎం అయ్యారు.

ఇదీ చదవండీ: సినీ డైరీ: 40 నిమిషాల చేజింగ్​.. 90 కార్లు ధ్వంసం

Patna (Bihar), May 29 (ANI): Rashtriya Janata Dal (RJD) leader Tejashwi Yadav on Wednesday said his party will meet top Congress leaders to introspect the "unexpected" results of the Lok Sabha elections in which they both faced a drubbing. "Congress party has invited us for the meeting in Delhi, where election results will be discussed. We are in touch with Rahul Gandhi, Priyanka Gandhi, Ahmed Patel and others. We will participate in the meeting there," Tejashwi told media in Patna. RJD which had stitched a grand alliance in Bihar against BJP-JDU-LJP combine faced a humiliating defeat as the party could not even open its account.
Last Updated : May 30, 2019, 5:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.