Hyderabad traffic New joint CP: హైదరాబాద్ ట్రాఫిక్ సంయుక్త పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి రంగనాథ్ బాధ్యతలు స్వీకరించారు. నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేసిన రంగనాథ్.. ఇటీవల సంయుక్త సీపీగా బదిలీ అయ్యారు. ట్రాఫిక్ ఇబ్బందులపై గతంలో డీసీపీగా పనిచేసిన అనుభవం ఉందని... అన్ని శాఖల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రంగనాథ్ తెలిపారు.
మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే సదరు వాహనదారులపై చర్యలు తప్పవని రంగనాథ్ హెచ్చరించారు. డిసెంబర్ 31న ట్రాఫిక్ ఆంక్షలపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తానని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మరింత విస్తృతం చేయడంతోపాటు... ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపడతానని రంగనాథ్ వివరించారు.
ఇదీ చదవండి: chairpersons take charge: పదవీబాధ్యతలు స్వీకరించిన కొత్త ఛైర్మన్లు..