ETV Bharat / state

Minister Harish Rao : వ్యాక్సినేషన్‌ మరింత వేగవంతం కావాలి: మంత్రి హరీశ్​

Minister Harish Rao :హైదరాబాద్‌ కొండాపూర్‌ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో అధునాతన వసతులను అందుబాటులోకి తెచ్చారు. అదనపు పడకల సముదాయాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Minister Harish Rao
Minister Harish Rao
author img

By

Published : Dec 8, 2021, 10:34 AM IST

Updated : Dec 8, 2021, 10:56 AM IST

Minister Harish Rao : వ్యాక్సినేషన్‌ మరింత వేగవంతం కావాలి: మంత్రి హరీశ్​

Minister Harish Rao : రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు సూచించారు. కొవిడ్‌ను ఎదుర్కొవాలంటే జాగ్రత్తలతో పాటు టీకానే మార్గమన్నారు.

Kondapur Government Hospital : హైదరాబాద్‌ కొండాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో... అధునాతన వసతులను అందుబాటులోకి తెచ్చారు. అదనపు పడకల సముదాయాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కొవిడ్‌ రోగులకు చికిత్స అందించేందుకు వీలుగా.... అదనంగా 120 పడకలతో మెరుగైన వసతులు కల్పించామని తెలిపారు. రహేజా కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా 10 కోట్లు ఖర్చు చేసినందుకు సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు.

'కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు సరిపోని సమయంలో రహేజా కంపెనీ ముందుకు వచ్చింది. ఇవాళ 100 పడకల ఫ్లోర్​ను ప్రారంభించుకున్నాం. 33 జిల్లాల్లో 86 లక్షల 90వేల రూపాయలతో.. 6వేల పడకలు చిన్నపిల్లల కోసం అందుబాటులోకి వచ్చాయి. 150 కోట్ల రూపాయలతో 900 పైగా.. ఐసీయూ బెడ్స్​ త్వరలో అందుబాటులోకి తెస్తాం. డయాలసిస్​ పెంపునకు కృషి చేస్తున్నాం.' - హరీశ్​రావు, మంత్రి

కేసీఆర్​ కిట్​ వచ్చాక 52శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. కొండాపూర్​లో అతి త్వరలో ఒక డయాలసిస్​ యూనిట్​ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్పొరేటర్​లు తమ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్​ అందేలా చూడాలని సూచించారు. వ్యాక్సినేషన్​ 100 శాతం జరగాలంటే.. ప్రజా ప్రతినిధులు సహా... ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు. రోజుకు సుమారు 4 లక్షల మందికి వ్యాక్సిన్​లు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని వివరించారు.

'సీఎస్‌ఐఆర్‌లో భాగంగా పడకల ఏర్పాటుకు కంపెనీల చేయూతనిచ్చింది. త్వరలో అందుబాటులోకి 900కిపైగా ఐసీయూ పడకలు వస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 52 శాతానికి పెరిగాయి. వ్యాక్సినేషన్‌ పూర్తికి ప్రతిఒక్కరి భాగస్వామ్యం అవసరం' - హరీశ్​రావు, మంత్రి

Last Updated : Dec 8, 2021, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.