Skill training under ISB: యువతలో వృత్తి నైపుణ్యాలు, వ్యాపార దృక్పథాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి ఓ కామన్ లెర్నింగ్ ప్రాజెక్టుతో ముందుకొచ్చింది. ఆన్లైన్ ద్వారా నైపుణ్యాలు అప్ గ్రేడ్ చేసుకునేలా రూపొందించిన ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర సాంకేతిక విద్యామండలి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో జట్టు కట్టింది. ఈ మేరకు హైదరాబాద్ ఐఎస్బీ జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో రెండు సంస్థలూ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
వీటి ఆధ్వర్యంలో యువతకు బిజినెస్ లిటరసీ, బిహేవియరల్ స్కిల్స్, డిజిటల్ లిటరసీ, ఎంటర్ప్రెన్యూర్ లిటరసీ అంశాల్లో శిక్షణనివ్వనున్నారు. ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న ఈ కోర్సుకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఐఎస్బీ, రాష్ట్ర సాంకేతిక విద్యామండలి కలిసి సంయుక్తంగా సర్టిఫికెట్ అందజేస్తాయి. పరిశ్రమ కోరుకునే నైపుణ్యాలు, ఆధునిక వ్యాపార పోకడలపై పట్టు సాధించినప్పుడే యువత విజయం సాధిస్తుందని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు.
ఇదీ చదవండి: Massmutual india in hyderabad: ద్వితీయశ్రేణి నగరాల్లోనూ సంస్థలు స్థాపించాలి: కేటీఆర్