ETV Bharat / state

CS review on SNDP works: నాలాల ప్రక్షాళన.. ఎస్​ఎన్​డీపీ పనుల పురోగతిపై సీఎస్​ సమీక్ష - telangana news

CS review on SNDP works: హైదరాబాద్​, హెచ్​ఎండీఏ పరిధిలో నాలాల ప్రక్షాళన కోసం ఎస్​ఎన్​డీపీ పనులను త్వరితగతిన చేపట్టాలని సీఎస్​ సోమేశ్​కుమార్​ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో సీఎస్​ సమావేశమయ్యారు. ముఖ్యమైన నాలాల వద్ద పరిస్థితిని ప్రతివారం క్షేత్ర స్థాయిలో తనిఖీ చేస్తానని సీఎస్​ స్పష్టం చేశారు.

cs somesh kumar review on sndp works
నాలాల పనులపై సీఎస్​ సమీక్ష
author img

By

Published : Dec 10, 2021, 8:32 PM IST

CS review on SNDP works: హైదరాబాద్‌తో పాటు హెచ్​ఎండీఏ పరిధిలో నాలాల ప్రక్షాళన కోసం చేపట్టిన ఎస్​ఎన్​డీపీ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఎస్​ఎన్​డీపీ పనుల పురోగతిపై సీఎస్​ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, ఈఎన్సీలు, జోనల్ కమిషనర్లతో సమావేశమైన సీఎస్​.. పనుల పురోగతిని తెలుసుకున్నారు.

ప్రతి వారం పరిశీలిస్తా

ప్రతి మంగళవారం ఎస్ఎన్డీపీ పనుల పురోగతిని సమీక్షిస్తానన్న సీఎస్.. ముఖ్యమైన నాలాల వద్ద పరిస్థితిని ప్రతి వారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తానని తెలిపారు. ప్రతి పనికి సంబంధించిన వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపొందించాలని చెప్పారు. పనికి సంబంధించిన పటం, ప్రభావం పడే ఆస్తులు, దగ్గర్లోని రెండు పడకల గదుల ఇళ్ల ప్రాంతాన్ని అందులో పొందుపర్చాలని సూచించారు. వివిధ శాఖల నుంచి అధికారులను కేటాయించి ప్రతి ఎస్ఎన్డీపీ పనికి ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: Kodandaram on TRS: 'ప్రభుత్వమే భూ కబ్దాదారు అవతారమెత్తింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.