మహిళల హక్కులు, రక్షణ కోసం ఒకే వేదికగా కలిసికట్టుగా పోరాడుతామన్నారు తెదేపా నాయకురాలు సుహాసిని. సమస్యలపై మహిళల గళం వినిపిద్దామని ఆమె పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో 'మహిళా నీకేది రక్షణ' పేరిట నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
చీకటిని చూసి బాధపడేకంటే చిరుదీపాన్ని వెలిగిస్తే మార్పు వచ్చే దిశగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం దోహదపడాలని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ తెలిపారు. సమాజంలో మార్పు లక్ష్య సాధనలో మహిళలు చేపట్టే కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని రమణ పేర్కొన్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలకు చెందిన మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి : పౌర చట్టం ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకం కాదు'