ETV Bharat / state

సినీనటి గీతాంజలికి కన్నీటి వీడ్కోలు - geetanjali passed away

గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సీనియర్ నటి గీతాంజలి అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలోని విద్యుత్ వాటికలో కుటుంబసభ్యులు గీతాంజలికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ముగిసిన సినీనటి గీతాంజలి అంత్యక్రియలు
author img

By

Published : Oct 31, 2019, 9:00 PM IST

ముగిసిన సినీనటి గీతాంజలి అంత్యక్రియలు

ప్రముఖ సినీనటి గీతాంజలి అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్​ మహాప్రస్థానంలోని విద్యుత్​ వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ ఉదయం గుండెపోటుతో మృతిచెందిన ఆమె పార్థీవదేహాన్ని నందినగర్​లోని నివాసం నుంచి అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్​కు తరలించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్​తోపాటు రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ, శివాజీరాజా, రమాప్రభ, ఉత్తేజ్, బాబుమోహన్, అన్నపూర్ణ, ప్రభ, కవిత సహా తదితర నటీనటులు, పలువురు అభిమానులు చాంబర్​కు చేరుకొని గీతాంజలి భౌతికకాయానికి నివాళులర్పించారు. చిత్రపరిశ్రమలో గీతాంజలి చేసి సేవలను గుర్తుచేసుకొని కన్నీంటి పర్యంతమయ్యారు. గీతాంజలి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నటుడు బాలకృష్ణ సహా పలు రాజకీయ పార్టీలు, ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఇదీ చూడండి: సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.