మాండౌస్ తుపాను ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఎన్టీఆర్ గార్డెన్, ప్రసాద్ ఐమ్యాక్స్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు కాసేపు ఇబ్బందిపడ్డారు. మరోవైపు వర్షం కారణంగా ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్‌కు ఆటంకం ఏర్పడింది. ఉదయం నుంచి జరగాల్సిన రేసింగ్.. వాన వల్ల మధ్యలో ఆపేశారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రేసింగ్ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఎల్లుండి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మాండౌస్ తుపాను శుక్రవారం రాత్రి పదిన్నర నుంచి తెల్లవారుజాము ఒకటిన్నర మధ్యలో మహాబలిపురం వద్ద తీరం దాటిందని వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు. ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు తీవ్ర వాయుగుండంగా బలహీనపడి.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ప్రస్తుతం చెన్నైకి వాయువ్య దిశగా 50 కి.మీ. దూరంలో కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి..
మాండౌస్ తుపాన్ ప్రభావం.. ఆ జిల్లాల్లో పొంగు పొర్లుతున్న వాగులు వంకలు
Indian Racing League in Hyderabad : హుస్సేన్‌సాగర్ తీరంలో కార్ రేసింగ్