రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నాయి. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా నేడు, రేపు అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో 7 చోట్ల స్వల్పంగా వర్షాలు కురిశాయి.
గత నెలలో కురిసిన భారీ వర్షాలకు చాలాచోట్ల చెరువులు, వాగులు పొంగిపొర్లాయి. పంట పొలాలు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆనకట్టలు తెగి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పలుచోట్ల ప్రజలు ప్రమాదకర స్థితిలోనూ ప్రయాణం సాగించారు. వరదల్లో చిక్కుకున్న పలువురు బాధితులను రెస్క్యూ బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
మరోవైపు ఏకధాటిగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. ఫలితంగా జలాశయాలన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ఇదీ చూడండి: CM KCR Speech: "కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరీ చేస్తోంది"