Weather Report: రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ద్రోణి కారణంగా మధ్య ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు దీని ప్రభావం ఉంటుంది.
ఛత్తీస్గఢ్ నుంచి కర్ణాటక వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.