బంగాళాఖాతంలో అండమాన్ దీవుల పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో సోమవారం అక్కడే అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా. ఇది మరింత బలపడి నాలుగైదు రోజుల్లో ఉత్తరాంధ్ర తీరానికి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి గాలులతో ఉపరితల ద్రోణి 1500 మీటర్ల ఎత్తున.. కోస్తాంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మీదుగా అరేబియా సముద్రంపై ఉన్న మరో ఉపరితల ఆవర్తనం వరకు వ్యాపించింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
ఆరోజు దంచికొట్టింది..
శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి(Heavy Rain in Hyderabad Yesterday) భాగ్యనగరం అతలాకుతలం అయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపించాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి.. రాత్రంతా అంధకారంలోనే గడిపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరూర్ నగర్ పైన ఉన్న చెరువులు అలుగు పారడంతో పలు కాలనీలన్ని వరద ముంచెత్తింది. డ్రైనేజీలు పొంగిపొర్లి కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనకు తోడు దోమలు విజృంభిస్తున్నాయని బాధిత జనం వాపోతున్నారు. రోగాలు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చంపాపేట, చందానగర్, చాంద్రాయణగుట్ట, జిల్లెలగూడ, దిల్సుఖ్నగర్, కోఠి, సరూర్నగర్, హయత్నగర్ పరిధిలోని చాలా వరకు కాలనీలు నీట మునిగాయి. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వరద(Heavy Rain in Hyderabad Yesterday) చుట్టుముట్టింది. శనివారం కూడా వరద ప్రభావం ఉండటం వల్ల చాలాచోట్ల జనజీవనం స్తంభించింది. జిల్లెలగూడ బాలాజీనగర్ కాలనీలో ఇళ్లలోకి మురికి నీరు చేరింది. ఆ ప్రాంతంలో డ్రైనేజీ పనులు జరుగుతుండటం వల్ల భారీ వర్షానికి మురికికాల్వలు పొంగిపొర్లి రహదారులపైకి, ఇళ్లలోకి చేరాయి. ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు తమ ఇళ్లు శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
శుక్రవారం వరణుడు సృష్టించిన బీభత్సం(Heavy Rain in Hyderabad Yesterday) ప్రభావంలోనే ఉన్న భాగ్యనగర ప్రజలు.. శనివారం కూడా వర్షాలు పడతాయన్న జీహెచ్ఎంసీ ప్రకటనతో భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోంచి బయటకు వెళ్తే ఎక్కడ వరద(Heavy Rain in Hyderabad Yesterday)లో చిక్కుకుంటామో.. తిరిగి ఇంటికి చేరుకుంటామో లేదోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం బయటకు వచ్చి.. వీలైనంత త్వరగా ఇల్లు చేరుకునేలా ప్రణాళిక చేసుకుంటున్నారు.
ఇదీ చూడండి: Telangana Weather Report: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడురోజులు వర్షాలు