ETV Bharat / state

Telangana Voters List 2023 : ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించిన ఎన్నికల సంఘం.. మొత్తం ఓటర్లు 3.06 కోట్లు - telangana voters list 2023

Telangana Voters List 2023 : వచ్చే శాసనసభ ఎన్నికకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల జాబితా ముసాయిదాను తాజాగా ప్రకటించింది. ఇందులో మొత్తం 3.06 కోట్లు మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో సగానికి పైగా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. అత్యధిక ఓటర్లు శేరిలింగంపల్లిలోనూ.. అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నారు.

Telangana Voters List
Telangana Voters List By Constituency 2023
author img

By

Published : Aug 22, 2023, 7:31 AM IST

Updated : Aug 22, 2023, 8:37 AM IST

Telangana Voters List By Constituency 2023 ఓటరు జాబితా ముసాయిదాను ప్రకటించిన ఎన్నికల సంఘం

Telangana Voters List 2023 : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం(Cental Election Commission) రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించింది. ఆ ముసాయిదా జాబితా ప్రకారం.. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య(Telangana Voters) 3,06,42,333. అందులో పురుషులు 1,53,73,066 కాగా.. మహిళలు 1,52,51,797 మంది ఉన్నారు. ఇతరులు 2,133 మంది ఉన్నారు. ప్రవాస ఓటర్లు 2,742, సర్వీసు ఓటర్లు 15,337 మంది ఉన్నారు.

ఈ ఏడాది జనవరి 5న విడుదల చేసిన జాబితాతో పొలిస్తే ప్రస్తుతం 6,64,674 మంది ఓటర్లు పెరిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్ జాబితాలో 18,019 ఏళ్ల మధ్య వయసు ఉన్న 4,76,597 పేర్లు నమోదు చేసుకున్నారు. పెరిగిన ఓటర్లలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో 64 నియోజకవర్గాల్లోనే పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది.

Telangana Voter List 2022 : 'రాష్ట్రంలో 5,99,900 మంది ఓటర్లు తగ్గారు'

Telangana Voters List By Constituency 2023 : నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా శేరిలింగంపల్లిలో 6,62,552 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా భద్రాచలంలో 1,44,170 మంది ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 43,01,401 మంది ఓటర్లు ఉండగా... అతి తక్కువగా ములుగు జిల్లాలో 2,12,278 మంది ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఓటర్ల సంఖ్య కోటికి పైగా ఉంది. అంటే మొత్తం ఓటర్లలో మూడో వంతు వరకు ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నారు.

Telangana Election 2023 : ముసాయిదా ఓటర్ల జాబితపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులను.. వచ్చేనెల 19వరకు నమోదు చేసుకోవచ్చని.. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. వాటిని పరిశీలించి ఈ అక్టోబర్‌4న తుది జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ప్రజలంతా తమ ఓటు ఉందో లేదో ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు. ఎవరైనా తమ ఓటును తొలగించినట్లు గుర్తిస్తే 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇప్పటి నుంచే అన్ని నియోజకవర్గాల్లో తమ వ్యూహాలను రచిస్తోంది.

Voter Awareness Telangana 2023 : అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. పోలింగ్ శాతం పెంచడంపై స్పెషల్ ఫోకస్

వారి బదిలీలపై నిషేధం ఓటర్ల: జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్నందున ఆబాధ్యతలు నిర్వర్తించే అధికారులు, ఉద్యోగుల బదిలీలపై.. కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఉప ఎన్నికల అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, తదితరులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరినైనా బదిలీ చేయాల్సి వస్తే అందుకు తగ్గ సంపూర్ణ కారణాలను వివరిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా ఈసీ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేసింది.

CWC ఎన్నికల బరిలో రాష్ట్రం నుంచి.. ఆ ముగ్గురు..!

Munugode bypoll: ఓటుకు నోటు.. మునుగోడులో ప్రలోభాల జోరు

Last Updated : Aug 22, 2023, 8:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.