ETV Bharat / state

'గిరిజనుల హక్కులు సాధించుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలి' - Telangana Tribal Lambadi Joint Action Committee Meeting

గిరిజనుల హక్కుల్ని కాలరాస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ను గద్దెదించేంత వరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు.  హైదరాబాద్ బషీర్ బాగ్​ ప్రెస్​క్లబ్​లో తెలంగాణ గిరిజన లాంబాడీ ఐకాస నిర్వహించిన చర్చా వేదికలో వారు పాల్గొన్నారు.

'గిరిజనుల హక్కులు సాధించుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలి'
author img

By

Published : Oct 29, 2019, 6:52 PM IST

గిరిజనుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో గిరిజనులపై వివక్ష కొనసాగుతోందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి అన్నారు. బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన గిరిజన లంబాడీ ఐకాస నిర్వహించిన చర్చావేదికలో ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్... ఇన్నేళ్లు గడిచినా హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. గిరిజనుల మద్దతుతో గెలిచిన ప్రజాప్రతినిధులు వారి సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హక్కుల కోసం చేసే పోరులో తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

'గిరిజనుల హక్కులు సాధించుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలి'

ఇదీ చూడండి: గిరిజన తండాల్లో ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.