గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఈ మెరకు ఆయన హైదరాబాద్‌లోని గండిపేటలో గల తారామతి బారామతిలో మొక్కలు నాటారు.
ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని శ్రీనివాస్ గుప్తా తెలిపారు. దేశాన్ని పచ్చని వనంలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ఎంపీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టూరిజం సెక్రటరీ శ్రీనివాస్ రాజు, ఎండీ మనోహర్ రావు, ఈడీ శంకర్ రెడ్డికి మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.
ఇదీ చదవండి: గో సడక్ బంద్‌లో పాల్గొన్న రాజాసింగ్.. అరెస్టు చేసిన పోలీసులు