1. వ్యాక్సిన్‌కు వేళాయే!
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఈ నెల 16న నిర్వహించే టీకా పంపిణీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అఖిలప్రియ నోరు విప్పిందా?
ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియ మూడో రోజు కస్టడీ ముగిసింది. రేపు మధ్యాహ్నం ఆమెను పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ప్రత్యేక విచారణ
జనగామ లాఠీఛార్జీ ఘటనపై డీసీపీతో విచారణకు వరంగల్ సీపీ ప్రమోద్‌కుమార్ ఆదేశించారు. బుధవారం భాజపా శ్రేణులపై లాఠీఛార్జీకి దారితీసిన ఘటనపై విచారణకు సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. సూత్రదారి అరెస్ట్
రుణ యాప్‌ల కేసులో ప్రధాన సూత్రధారి సహా ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి కేంద్రంగా రుణ యాప్‌లు నిర్వహిస్తున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కోడిశాస్త్రం ఏం చెబుతోంది?
పౌరుషానికి ప్రతిరూపాలు పందెంకోళ్లు.. కత్తికట్టి బరిలోకి దించితే.. యజమాని పరువు కోసం.. ప్రాణాలు పణంగా పెట్టి.. కొట్లాడుతుంది. ఇక సంక్రాంతి అంటే.. కోళ్ల కొట్లాట కాదు... కోట్లాటే.! ఢీ అంటే ఢీ అనే కోడి పుంజులకు గిరాకీ ఎక్కువ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. భారీ అగ్నిప్రమాదం
కోల్‌కతాలోని బాగ్‌బజార్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. అయితే గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ముహూర్తం కుదిరిందా?
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. మళ్లీ.. మహమ్మారి
చైనాలో ఎన్నో నెలల అనంతరం రోజువారీ కరోనా కేసుల సంఖ్య 100 దాటింది. వైరస్ మూలాలను కనుగొనేందుకు గురువారం డబ్ల్యూహెచ్ఓ బృందం వస్తున్న తరుణంలో ఈ స్థాయిలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. సినిమా అప్డేట్స్
సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో వకీల్‌సాబ్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ టీజర్, రాజ్ తరుణ్ కొత్త చిత్రం, ద గర్ల్ ఆన్ ది ట్రైన్ టీజర్ సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఎంపీ ట్వీట్‌కు విహారి కౌంటర్!
తన ఆటతీరును విమర్శిస్తూ ట్వీట్ చేసిన కేంద్రమంత్రి, భాజాపా ఎంపీ బాబుల్ సుప్రియోకు క్రికెటర్ హనుమ విహారి హుందాగా రీట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు అతడిని తెగ పొగిడేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.